Wednesday, June 18, 2014

నారూటే వేరు


Published at: 01-06-2014 00:41 AM
హైదరాబాద్ అమీర్‌పేటలోని హరనాథరావు ఫ్లాట్ లోపలికి వెళ్లగానే.. ఎడమవైపునున్న గోడకు సుభాష్‌చంద్రబోస్, కుడివైపునున్న గోడకు బుద్ధుడు చిత్రపటాలు కనిపిస్తాయి. హేతువాదం, అభ్యుదయవాదం.. ఇవి రెండూ ఆయన్ని ఎంతగా ప్రభావితం చేశాయో చెప్పకనే చెబుతాయవి. దేవుళ్లను ప్రశ్నించే 'దేవాలయం', అన్యాయంపై తిరగబడే 'ప్రతిఘటన' సినిమాలు చాలు ఆయన ఎంత శక్తివంతమైన డైలాగులు రాశారో చెప్పడానికి! ఇప్పటి వరకు వంద చిత్రాలకు పైగా డైలాగులు రాసి.. విలక్షణమైన రైటర్‌గా పేరు తెచ్చుకున్న ఎంవీఎస్ హరనాథరావుతో ఈ వారం మన డైలాగ్‌గురు. ఆయన్ని కదిపితే.. ఇలా చెప్పుకొచ్చారు..
ప్రతిఘటన
"మాది ఒంగోలు. నాటకాలతో నా రచనావ్యాసంగం మొదలైంది. అప్పట్లో పాతిక నాటకాల దాకా రాశాను. ఆంధ్రదేశమంతా తిరిగి వాటిని ప్రదర్శించేవాణ్ణి. అభ్యుదయ దర్శకుడు టి.కృష్ణతో పరిచయం కావడం వల్ల సినిమా జీవితం మొదలైంది. నా మొదటి సినిమా ఎ.వి.మురుగన్ తీసిన 'వాడని మల్లి'. ఆ తర్వాత 'దేశంలో దొంగలు పడ్డారు', 'ఎర్రమందారం', 'సగటుమనిషి' సినిమాలకు రాశాను. ఇవన్నీ ఒక ఎత్తయితే 'ప్రతిఘటన'కు డైలాగులు రాయడం మరో ఎత్తు. ఈ సినిమాకు డైలాగులు రాశాకే.. 'ఎవరీ హరనాథరావు?' అనే ఆసక్తి సినీలోకంలో మొదలైంది. గౌరవం పెరిగింది. వెంటవెంటనే విపరీతమైన అవకాశాలు వచ్చిపడ్డాయి. ఒక చిన్న సంఘటన ప్రేరణతో పుట్టిన కథ ఇది. ఒంగోలులో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఎన్నికల్లో పోటీకి నిలబడ్డాడు. అతనిది చాలా చిత్రమైన స్వభావం. ఒక రోజు రాముడు, మరొక రోజు కృష్ణుడి వేషం వేసుకుని ప్రచారం చేసేవాడు. సర్కస్ వాళ్లను బతిమాలి ఏనుగుల్ని, ఒంటెల్ని తీసుకొచ్చి వాటి మీద కూర్చుని ఊరేగేవాడు. తను గెలిస్తే 'సముద్రపు నీళ్లను మంచి నీళ్లుగా మార్చేస్తా'నని హామీ ఇచ్చేవాడు. అతని వాలకం చూసిన ఎలక్షన్ ఆఫీసరు.. అభ్యర్థి మెదడు సరిగా లేదని అభ్యర్థిత్వాన్ని రిజెక్ట్ చేశాడు. ఆ సంఘటన ప్రేరణతోనే 'ప్రతిఘటన'కు మాటలు రాయడం మొదలుపెట్టాను. ఒక సీన్‌లో "మీరు మంచివాళ్లు అనుకుని జనాలు నిలబెడితే, గెలిచిన తర్వాత జనాలను పిచ్చివాళ్లను చేస్తున్నారు. ఈ సారి ఒక పిచ్చివాడికి అవకాశం ఇవ్వండి. జనాలను మంచివాళ్లను చేస్తాడు'' అని రాశాను.
మంచిదొంగ
అభ్యుదయ భావాలతో మాటలు రాస్తాననే భావన నుంచి నన్ను బయటికి తీసుకొచ్చిన సినిమా 'మంచిదొంగ'. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావడం గొప్ప కదా! ఇందులో మోహన్‌బాబుకు రాసిన 'నా రూటే వేరు' డైలాగ్‌కు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. చిరంజీవికి రాసిన 'జంకుజమలస్కుటప' అనే ఊతపదం కూడా బాగా పేరుతెచ్చింది. వీటికేమీ అర్థం లేదు. పాత్ర స్వభావానికి సరిపడే పదబంధాలను సృష్టించడం.. అవి ప్రేక్షకుల నోళ్లలో కొన్నాళ్లు నానడం.. ఎక్కువమందికి నచ్చిందనడానికి నిదర్శనం. ఇదే సినిమాలో చిరంజీవి "దొంగాపోలీసు వైఫ్ అండ్ హజ్బెండ్‌లా ఉండాలి. ఎందుకంటే ఇద్దరూ కలిసేది రాత్రిపూటే కాబట్టి'' అంటారు. "కోహినూరు వజ్రం కాజేసింది ఒక దొంగ కాదు. ఒక సామ్రాజ్యం. అదే పని ఒక దొంగ చేస్తే వాడు బందిపోటు, దోపిడీదారుడు అంటారు'' అన్న డైలాగ్ అప్పట్లో చాలామంది మెప్పు పొందింది.
రాక్షసుడు
'రాక్షసుడు'లో నా వేషానికి నేనే డైలాగులు రాసుకునే అరుదైన అవకాశం చిక్కింది. ఆ ప్రతినాయక పాత్ర పేరు 'నరకాసురుడు'. కేవలం ఒకటిన్నర నిమిషం కనిపించే వేషం అది. ఏ వేడుకకు వెళ్లినా ఆ పాత్రను గుర్తు చేస్తుంటారు ప్రేక్షకులు. "అబ్బానీయబ్బా వెంకటసుబ్బా! పంతులమ్మ పెంచే పందెంకోడి ఇదేనట్రా. ఈకలు పీకతా! పంతులమ్మ ఉసిగొల్పిన పొట్లగిత్త ఇదేనట్రా. కొమ్ములు పెరకతా! కోటప్పకొండ దగ్గర దొప్పల చెరువుకాడ గొప్పల అప్పలకొండ నాకేం అవుతాడ్రా.. అబ్బా నీయబ్బా వెంకటసుబ్బా. యముకలుకొరకతా!!'' అన్న డైలాగ్ నాకు తెచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు. మద్రాసులో శతదినోత్సవ వేడుకలు జరుగుతున్నప్పుడు.. నేను వేదిక మీదికి వస్తుంటే.. ప్రేక్షకుల నుంచి విజిళ్లు, అరుపులు. విచిత్రం ఏమిటంటే కొన్నేళ్లపాటు రంగస్థల నటుడిగా ఎన్ని విభిన్నమైన పాత్రలు చేసినప్పటికీ నరకాసురుడు పాత్రకు వచ్చినంత పేరు రాలేదు. ఆ వేడుకలో బాలచందర్‌గారు ప్రత్యేకంగా నన్ను పిలిచి అభినందించడం మరపురాని అనుభవం.
ఇదా ప్రపంచం
నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా 'ఇదా ప్రపంచం'. ముత్యాలసుబ్బయ్య దాని దర్శకుడు. కథ, మాటలు నావి. రైల్వేస్టేషన్‌లో జరిగిన యదార్థగాథ ఇది. నాటకాలు వేస్తున్న రోజుల్లో విజయవాడకు వెళ్లినప్పుడు అనుకోని పరిస్థితుల్లో రైల్వేస్టేషన్‌లోనే పడుకోవాల్సి వచ్చింది. ఉన్నట్లుండి పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి రైలుపెట్టెల్లో గాలించడం మొదలుపెట్టారు. అప్పటికే ఏవో కేకలు వినిపిస్తున్నాయి. పోలీసులను చూసి అయిదుగురు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. తీరా వెళ్లి చూస్తే.. ఒక మతిస్థిమితం లేని మహిళపై వాళ్లు అత్యాచారం చేసినట్లు తేలింది. అది తెలిసాక ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అదే ఇతివృత్తంతో 'అరణ్యరోదన' అనే పేరు మీద కథ రాసి స్వాతి పత్రికకు పంపిస్తే అచ్చువేశారు. ఈ తర్వాత దాన్నే 'ఇదా ప్రపంచం' సినిమాగా తీశారు. నంది అవార్డుల స్క్రీనింగ్ కమిటీకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన డివిఎస్ రాజు పబ్లిక్‌గార్డెన్‌లో తారసపడి "హరనాథ్.. నీ సినిమా చూశానయ్యా! అందులో నువ్వు రాసిన ఒక్కో మాట నా గుండెల్ని తాకింది. అందుకే నంది అవార్డు ఇస్తున్నాము'' అన్నాడు.
సూత్రధారులు
ఈ సినిమాకు నేను డైలాగ్ రైటర్‌నని ప్రకటించాక.. "గొడ్డళ్లు పట్టే రాతలు రాసే హరనాథరావు.. సంప్రదాయవాది విశ్వనాథ్‌గారి సినిమాకు ఎలా రాయగలడు?'' అన్న కామెంట్లు వచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావుగారితో తొలి, చివరి సినిమా అదే! ఆయనకు ఒక సన్నివేశంలో ఒకటిన్నర పేజీల డైలాగు రాయాల్సొచ్చింది. హింసకు, అహింసకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెప్పాల్సి వచ్చింది. "నోరున్న మనిషికి, ప్రాణమున్న మనిషికి, ఆలోచన ఉన్న మనిషికి.. నోరులేని, ప్రాణంలేని, ఆలోచనలేని గొడ్డలితో సమాధానం చెప్పాలని చూస్తున్నారు. పులిని బ్రాహ్మడు పెంచినా అది మాంసాన్నే కోరుకుంటుంది. ఒకడు దుర్మార్గం చేయడానికి కారణం మనం కాదా? గోదారికి పొంగు వచ్చినా, కడుపు మండిన వాడికి ఆవేశం వచ్చినా ఎవడూ ఆపలేడు''. విలన్‌లో మానసిక పరివర్తన తెచ్చే మాటల సందర్భంలో వస్తుందీ డైలాగ్. ఎఎన్ఆర్ అంత గొప్ప నటుడికి నేను మాటలు అందించడం వినాయకుడికి అక్షరాభ్యాసం చేసినట్లు భావించాను.
రేపటిపౌరులు
'రేపటిపౌరులు'లో వ్యభిచారం చేస్తున్న మహిళను విచారణకు పిలిచే సన్నివేశం ఒకటుంది. అప్పటి వరకు శృంగార పాత్రలు వేసిన అనురాధ ఒక గొప్ప నటి అని నిరూపించుకునేందుకు నా డైలాగులు తోడ్పడ్డాయి. కోర్టు బోనులో నిలబడిన ఆమె బాధతో "ఈ ప్రపంచంలో జరిగే అవినీతిలో మా భాగం కొద్దే! ప్రతి రాత్రి పడుకునే దుప్పటి ఎన్నిసార్లు మార్చానో అన్నిసార్లు ఆలోచించాను. గదిలో దీపం ఎన్నిసార్లు ఆరిపోతుందో అన్నిసార్లు ఆలోచించాను. చీకట్లో మేం చేసే పాపాలకు బాధతో కన్నీళ్లు కారుస్తుంటే.. ఆ కన్నీళ్లను చేతులతో తడిమి అబ్బో నీకప్పుడే చెమటలు పుట్టించాను అనే నీచ నికృష్ట రసిక మగ జాతి ఉన్నంత కాలం.. మా శరీరాలను అమ్ముకోవాల్సిందే!'' అంటుంది. దర్శకుడు టి.కృష్ణకు నాకు మధ్య మంచి అవగాహన ఉంది. నా ఆలోచనా ధోరణి ఆయనకు తెలుసు. ఆయన ఆలోచనలు నాకు తెలుసు. భావాల జోడీ కుదరడం వల్ల మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అప్పట్లో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ కోవలో వచ్చిందే ఈ సినిమా.
ఎర్రమందారం
ఈ కథను కొన్నేళ్ల కిందట రాసుకున్నాను. దాన్ని బాలచందర్‌గారు కూడా ఇష్టపడ్డారు. అయితే ఈ కథను అప్పటికే రంజిత్‌కుమార్‌గారు తీసుకున్నారు. ఆ తర్వాత ఇరవై ఏళ్లకు రంజిత్‌గారి అనుమతితో సినిమా తీశారు. నాకు ఒక కోరిక ఉండేది - డైలాగులు తక్కువగా, దృశ్యం ఎక్కువగా ఉండాలీ అని. ఈ సినిమాతో ఆ కోరిక కొంత వరకు నెరవేరింది. నేను సృష్టించిన పాత్రకు రాజేంద్రప్రసాద్ న్యాయం చేశారు. ఇందులో మంచి మాటలు ఉన్నాయి. చేయని నేరానికి జైలుకు వెళతాడు హీరో. జైలు నుంచి తిరిగి వచ్చిన భర్తను బస్టాండులో కలుస్తుంది అతని భార్య. బస్టాండు నుంచి ఇంటికొచ్చే వరకు రాజేంద్రప్రసాద్ పాత్రకు మాటలు లేవు. అక్కడ అవసరం లేదనిపించింది. కాని భార్య అతను జైలుకు వెళ్లినప్పటి నుంచి జరిగిన సంఘటనలను చెపుతూనే ఉంటుంది. అతను మాత్రం మాట్లాడడు. తను నిరపరాధి. జైలుకు పంపించారన్నదే అతని ఆవేదన. తీవ్రమైన ఆవేదనలో ఉన్నప్పుడు మాటలు రావు. రెండు మూడు నిమిషాలు గడిచాక.. భర్త మౌనాన్ని భరించలేని భార్య - భోరున ఏడుస్తూ.. "నాలో నేనే మాట్లాడుకుంటుంటే అందరూ నన్ను పిచ్చిదాన్ని అంటారు..'' అంటుంది. అప్పటికీ అతను మౌనం వీడడు. అయితే భార్యను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటాడు. ఇది నాకు నచ్చిన దృశ్యం. కెమెరా మాట్లాడలేనప్పుడే.. పాత్ర మాట్లాడాలి అన్నది నా ఫిలాసఫీ!
పుణ్యభూమి నా దేశం
హిందీ ఫిల్మ్‌కు రీమేక్ 'పుణ్యభూమి నా దేశం'. దర్శకుడు కోదండరామిరెడ్డి. హిందీ స్క్రిప్టును నా చేతుల్లో పెట్టి డైలాగులు రాయమన్నారు. అప్పుడు మోహన్‌బాబుగారితో నేను "సార్, హిందీలో మంచి డైలాగులే ఉన్నాయి. అయితే వాటిని యధాతథంగా రాయను. తెలుగులో వాటికంటే బాగా రాయడానికే ప్రయత్నిస్తాను. రెండింటిలో మీకు ఏవి నచ్చితే అవి పెట్టుకోండి'' అన్నాను నేను. నా క్రమశిక్షణను ప్రేమించే మనిషి ఆయన. కాదనకుండా ఒప్పుకున్నారు. డైలాగులు రాసి చదివి వినిపించాక.. ఆయనకు బాగా నచ్చాయి. సినిమాలో అవే వాడుకోవడం జరిగింది. ప్రేక్షకులకు సూటిగా స్పష్టంగా అర్థమయ్యే మాడ్యులేషన్‌లో మోహన్‌బాబు డైలాగులు చెబుతారు కాబట్టి.. క్లయిమాక్స్‌లో మంచి డైలాగులు రాసే అవకాశం దొరికింది. ఒక చోట "ఈ ప్రపంచంలో రెండే మతాలు. ఒకటి బతికున్న వాళ్ల మతం. రెండు చచ్చిన వాళ్ల మతం. నేను హిందువునని మా అమ్మ కడుపులో అరవై నెలలు, నువ్వు ముస్లింవని మీ అమ్మ కడుపులో డెభ్భై నెలలు ఉన్నామా? ఒక హిందువు ముస్లిం స్త్రీని పెళ్లాడితే మతం మారిందని పిల్లలు పుట్టరా? ఏ మతం చెప్పింది మతాల పేరుతో తన్నుకు చావమని. అదే నిజమైతే మందిరాలు, మసీదులు ప్రార్థనలు చేసే స్థలాలు కావు. దేవుణ్ణి పూడ్చిపెట్టే స్థలాలు..'' అనే డైలాగ్ ఉంది. నేను మాటకు రూపం ఇస్తే ఆయన ప్రాణం పోశారీ చిత్రంలో. మరొక డైలాగు-"బ్రిటిషు వాణ్ణి వెళ్లగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సులకన్నా, తగలబడిన ఆఫీసులుకన్నా చచ్చిన మనుషులకన్నా 47 ఏళ్ల స్వాతంత్య్రంలో మన రాజకీయాల కోసం, మన వర్గాల కోసం, మన కులాల కోసం మనం తగలబెట్టుకున్నదే ఎక్కువ''. నేటి రాజకీయాలకు అతికినట్లు సరిపోయే మాటలు ఇవి.
యమ్ ధర్మరాజు ఎంఏ
ఈ సినిమా చూశాక 'ఆ డైలాగులు మా మీద రాశారంటే మా మీద రాశారు' అని కొందరు పొలిటీషియన్ల నుంచి కామెంట్లు వచ్చాయి. రాజకీయ నాయకులు అనే వాళ్లు ప్రత్యేక జాతి కాదు. మనుషుల్లో ఉన్న జాతే! రాజకీయనేతల స్వభావాన్ని సినిమాటిక్‌గా చెప్పడంవల్ల పెద్దహిట్ అయ్యిందీ చిత్రం. అప్పటి వరకు హీరోగా చేస్తున్న మోహన్‌బాబు నెగటివ్‌షేడ్ కలిగిన పాత్రను చేయడం ఒక సాహసం. ఆద్యంతం ఆకట్టుకునే సంభాషణలు ఇందులో చాలానే ఉన్నాయి. ఒకే వేదిక మీద పోలీసుఅధికారి, రాజకీయనేత వేషం వేసిన మోహన్‌బాబు కూర్చుంటారు. నాటుసారా కాసే తన మనుషుల్ని అరెస్టు చేయడంతో.. విడుదల చేయమని అడుగుతాడు. అప్పుడు పోలీసుఅధికారితో మోహన్‌బాబు "బురదలో ఉన్న పంది జోలికి.. అధికారంలో ఉన్న నాయకుల జోలికి వెళ్లకూడదు'' అంటాడు. ఈ డైలాగు ఎంతమందికి నచ్చిందో చెప్పలేను.
"సామాన్య ప్రేక్షకులను సినిమాకు రప్పించాలంటే.. సహజసిద్ధమైన సంభాషణలు అవసరం. తొలినాళ్లలో వచ్చిన సాంఘిక చిత్రాలలో అలాంటి సంభాషణలే ఉండేవి. మధ్యలో మెలోడ్రామాలు పెరిగి - శబ్దం తప్ప అర్థం తక్కువైన మాటలు వచ్చాయి. అవి కూడా విజయవంతం అయినా ఇప్పుడు మళ్లీ మనం మొదటిదశకు వెళ్లి సహజమైన సంభాషణలు కావాలంటున్నాం. సహజత్వం లేనిది ఏదీ జీవితానికి దగ్గరగా ఉండదు అనేందుకు ఈ ట్రెండ్ నిదర్శనం''
"నాన్నా.. రేపు ఎగ్జామ్ ఉంది చదువుకోవాలి. నువ్వు వెళ్లు'' అంటే "ఈ వెధవ చదువు ఎప్పుడూ ఉండేదే లేరా. నాటకం చూద్దువు గాని నాతోపాటు బయలుదేరు'' అని తండ్రి ఏ రోజైతే నాటకాల మీద ఆసక్తిని కలిగించారో ఆ రోజు నుంచి.. రంగస్థల వేదికనే జీవితంగా చేసుకున్న ఎంవిఎస్ హరనాథరావు.. పాతిక నాటకాలు రాసి ప్రసిద్ధి పొందారు. ఆతర్వాత మద్రాసు వెళ్లిపోయి సినిమాల్లో రైటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. టి.కృష్ణ, పోకూరిబాబూరావు, కె.విశ్వనాథ్,రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, ముత్యాలసుబ్బయ్య, సురేష్‌కృష్ణ వంటి దర్శకులతో కలిసి పనిచేశారాయన. డైలాగులు రాసిన వంద సినిమాల్లో సగం సినిమాలు హిట్ అయ్యాయి. రేపటి పౌరులు, ప్రతిఘటన, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, అమ్మాయికాపురం, ఎర్రమందారం, భరతనారి, మంచిదొంగ, పుణ్యభూమి నా దేశం, పరువు ప్రతిష్ట, యమ్ ధర్మరాజు ఎంఎ, ఏవండీ ఆవిడ వచ్చింది, ధర్మచక్రం, అన్న, శ్రీమతీ వెళ్లొస్తా.. తదితర చిత్రాలకు రాసిన సంభాషణలు పేరు తెచ్చాయి. ఇప్పటి వరకు అయిదు సినిమాలకు ఉత్తమ డైలాగ్ రైటర్‌గా నంది అవార్డులు అందుకున్నారాయన.
"తాపీధర్మారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, చలం, సుంకరవాసిరెడ్డి, సముద్రాల, మల్లాది, ఆత్రేయ, ముళ్లపూడి, డివి నరసరాజు, జాన్సన్ వంటి ఎందరెందరో మహానుభావులు అద్భుతమైన మాటల సంపదను తెలుగు సినీ రచయితలకు అందించారు. ఆ పునాదుల మీదే తెలుగులో డైలాగ్ రైటింగ్ ఎదిగింది''
"నేటి మాటల రచయితల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నాకు ఇష్టం. అతని డైలాగుల్లో సున్నితత్వంతోపాటు చక్కటి అర్థం ఉంటుంది. నిరాడంబరత కనిపిస్తుంది. అందుకే అందరికీ గుర్తుండిపోవడమే కాదు.. వేగంగా ప్రాచుర్యం పొందుతాయి''
- మల్లెంపూటి ఆ

స్పాట్ పెట్టింది నేనే


Published at: 08-06-2014 00:18 AM
డైలాగ్ గురూస్
పొట్టి పొట్టి పదాలతో చిత్ర విచిత్రమైన మాయాజాలం చేసి.. నటులకు ఒక ప్రత్యేక మానరిజాన్ని సృష్టించి.. ప్రేక్షకుల మనసుల్ని దోచే డైలాగులను రాసిన తోటపల్లి మధు.. అయిదేళ్ల వయసప్పుడే ఒక చిన్న వేషంతో కెరీర్‌ను ప్రారంభించారు. పాతిక నాటకాలు రాసిన అనుభవంతో.. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్లిపోయి.. చేతికి ఏ సినిమా దొరికితే ఆ సినిమాకు రాయడం మొదలెట్టారు. చిరంజీవి హీరోగా చేసిన 'దేవాంతకుడు' దగ్గర నుంచి.. వరుసబెట్టి నూటా ఎనభై తొమ్మిది చిత్రాలకు రాశారీయన. హ్యూమర్, సెంటిమెంట్, ఫ్యామిలీ, పొలిటికల్ డ్రామా.. ఇలా ఏదైనా సరే.. అవలీలగా రాసేయగలరాయన. కలికాలం, అంకుశం, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, చిత్రం భళారే విచిత్రం, అల్లరి అల్లుడు, రాముడొచ్చాడు, మహారథి, రిక్షావోడు, హనుమాన్‌జంక్షన్, యముడికి మొగుడు, లక్ష్మీనరసింహ, అల్లరిపోలీస్, శుభమస్తు.. ఇలా పలు చిత్రాలకు రాసిన మధు.. తనకు గుర్తున్న కొన్ని డైలాగుల గురించి ఇలా చెప్పుకొచ్చారు..
డాకు
'రిలేషన్' - అనే చిన్న పదం మీదే ఎన్నో కథలు పుట్టాయి. డైలాగులు వచ్చాయి. అందుకే ఎప్పటికప్పుడు కొత్తగా రాస్తే తప్ప పండవు. దర్శకుడు సత్యారెడ్డి తీసిన 'డాకు' చిత్రానికి మాటలు రాయడం నాకొక సవాలు. వ్యభిచారిణి పాత్ర వేసిన ముచ్చర్ల అరుణకు, సుమన్‌కు మధ్య ఒక సన్నివేశం వస్తుంది.
అప్పుడు సుమన్ "డబ్బు ఇస్తే వద్దంటావు. ప్రతి ఆడదీ కోరుకునే మాంగల్యాన్ని కాదంటావు. అసలు మనిద్దరినీ ఒకటి చేసిన బంధం ఏది?'' అని అడుగుతాడు. అందుకు స్పందిస్తూ అరుణ "ఉందనుకుంటే మనిద్దరి మధ్య బంధం ఉంది, అది పెళ్లి కంటే పవిత్రమైనది. లేదనుకుంటే మనిద్దరి మధ్య నీచమైన సంబంధం ఉంది, అది డబ్బు కంటే పాపిష్టిది. అందుకే ఆ రెండూ మన మధ్య ఉండకూడదు'' అంటుంది. అరుణ చెప్పిన ఆ డైలాగు అప్పట్లో ఎంతో మందికి నచ్చింది. ఆత్రేయగారైతే నన్ను పిలిచి "ఒరే, మహాయజ్ఞం కోసం తీసుకొచ్చిన సమిధను వంట చెరుగ్గా వాడేశావేంట్రా?'' అనడం నాకొక పెద్ద బహుమానం.
కలికాలం
'ఎకనామిక్స్ ఈట్స్ ద సెంటిమెంట్స్' అనే ఏకవాక్యంతో పుట్టిన చిత్రం 'కలికాలం'. ఈ సినిమాను దర్శకుడైన ముత్యాలసుబ్బయ్య, నేను కలిసి సొంతంగా తీద్దామనుకున్నాము. కథానాయిక పాత్ర వేయాలనుకున్న జయసుధకు కథ బాగా నచ్చింది. అయితే ఇంటికెళ్లిన తర్వాత ఆమె "ఏమండీ.. ఈ సినిమాను మేమే సొంతంగా తీస్తాము. మాకే ఆ అవకాశం ఇవ్వండి'' అని అడిగారు. అప్పటికే ఆమెకు నిర్మాతగా 'కాంచనసీత', 'ఆదిదంపతులు' తీసిన అనుభవం ఉండటంతో అంగీకరించాం. ఇందులోని ప్రతి సన్నివేశమూ ఒక ఆణిముత్యం. జయసుధ కొడుకైన సాయికుమార్‌ది అల్లరిచిల్లరగా తిరిగే క్యారెక్టర్. తండ్రి గడియారాన్ని తాకట్టు పెట్టి క్రికెట్ మ్యాచ్ చూసొస్తాడు. విషయం తెలిసిన జయసుధ "ఒరే, నాన్నగారి వాచీని నువ్వు పట్టుకెళ్లి తాకట్టుపెట్టి క్రికెట్ మ్యాచ్ చూడ్డం కాదురా. ఈ ఇంట్లో ఆయనొక్కడే సింగిల్ బ్యాట్స్‌మాన్‌గా పరిగెడుతున్నాడు. రన్అవుట్ అవకుండా చూడు'' అంటుంది. మరో సందర్భంలో సాయికుమార్ తన చెల్లెలును ఓ పదివేలు అప్పు ఇవ్వమని అడుగుతాడు. "వడ్డీ ఎంతిస్తావు?'' అంటుంది చెల్లి. "రెండు రూపాయలు'' అంటాడు అతను. "లేదు మూడు రూపాయలు అయితేనే'' అంటుందా అమ్మాయి. పక్కనే ఉన్న జయసుధతో ఆ అమ్మాయి "ఎలా కొట్టానమ్మా దెబ్బ'' అంటుంది.
"ఏమోనమ్మా.. మీరు ఏ దెబ్బ కొట్టినా గుండెలు పగిలిపోయేంత గొప్పగా ఉంటుంది'' అని ఆ ఇంటి పరిస్థితిని దిగమింగుతూ బతుకుతున్న జయసుధ చెప్పే ఆ డైలాగ్.. గుండెల్ని పిండేసిందని ఇప్పటికీ ప్రేక్షకులు చెబుతూనే ఉంటారు.
షిరిడి సాయిబాబా మహత్యం
నా జీవితాన్నే మలుపు తిప్పిన చిత్రం 'షిరిడి సాయిబాబా మహత్యం'. కథ, మాటలు కూడా నేనే రాశాను. విజయచందర్ ప్రధానపాత్ర పోషించగా ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. నేను ఇప్పటివరకు 189 చిత్రాలకు మాటలు రాసినా.. ఒక్క సినిమా స్క్రిప్టును కూడా దగ్గరుంచుకోలేదు. ఈ సినిమా ఫుల్‌స్క్రిప్టును బైండింగ్ చేయించుకుని దాచుకున్నాను. చిత్రంలో కొన్ని కల్పించి రాసినవైతే మరికొన్ని సాయి చరిత్రలో నుంచి తీసుకుని రాసినవి. ఒక సీనులో బాబా వద్దకు ఒకతను వచ్చి ఏవో నాలుగు నిర్లక్ష్యపు మాటలు మాట్లాడి వెళతాడు. అప్పుడు అక్కడే ఉన్న ఓ భక్తుడు బాబాతో "బాబా.. మీ స్థానంలో కూర్చుని మీ స్థాయిని కించపరుస్తూ ఆ పిచ్చివాడు ప్రశ్నించడం ఏమిటి? మీరు సమాధానం చెప్పడం ఏమిటి?'' అనడుగుతాడు. అందుకు స్పందిస్తూ బాబా "మీరు అనుకున్నట్లు ఆయన పిచ్చివాడు కాదు. ఈ ప్రాపంచిక అవధులు దాటిన అవధూత'' అని చెబుతాడు. మరో చోట భక్తుల్ని ఉద్దేశించి "ఈ ఆకారాన్ని చాలిస్తున్నానే కానీ మీ మనో ప్రాకారాన్ని దాటి వెళ్లగలనా'' అంటాడు. ఇంకో సన్నివేశంలో "నా భక్తులైన వారికి నా సమాధిలో నుంచే సమాధానం చెబుతాను'' అని బోధిస్తాడు. ఈ సినిమా నాకు 'నేషనల్ ఇంటెగ్రిటీ', 'నంది' అవార్డుల్ని తెచ్చిపెట్టింది. తమిళంలోనూ మంచి పేరు తీసుకొచ్చింది. చెన్నైలో విజయోత్సవానికి వెళ్లినప్పుడు ప్రముఖ తమిళ రచయిత అరుళ్‌దాస్ నన్ను చూసి 'అప్పా వర్లియా' (మీ నాన్న రాలేదా?) అనడిగారు. 'మా నాన్నగారు ఎప్పుడో పోయారు సార్' అన్నాను. 'అదేంటి, ఈ సినిమాకు డైలాగ్ రైటర్ ఎవరు?' అన్నాడాయనే మళ్లీ. 'నేనే సార్' అన్నాను. 'మీ నాన్నగారు రాశారనుకున్నానయ్యా. ఇంత చిన్న వయసులో అంత బాగా రాశావు' అని ఆశ్చర్యపోతూ భుజం తట్టారు.
అంకుశం
కోడిరామకృష్ణ దర్శకత్వం చేపట్టిన పధ్నాలుగు చిత్రాలకు డైలాగులు రాశాన్నేను. అయితే అవన్నీ ఒక ఎత్తయితే 'అంకుశం' కోసం పనిచేయడం మరో ఎత్తు. తెలుగులో వచ్చిన 'ప్రతిఘటన', హిందీలో వచ్చిన 'అర్ధసత్య'లను స్ఫూర్తిగా చేసుకుని రూపొందిన చిత్రం ఇది. నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సర్వశక్తులు ఒడ్డి దీన్ని తీశారు. ఇదివరకంతా ఒక టైపు సినిమాలకు డైలాగులు రాసిన నాకు ఇదొక ఛాలెంజ్ అయ్యింది. ఇందులో విలన్ రామిరెడ్డి అనే 'స్పాట్ పెడదాం' డైలాగు నాకెంతో పేరు తెచ్చింది. నా సొంతూరు విజయవాడ. చదువుకునే రోజుల్లో 'యునైటెడ్ ఇండిపెండెన్స్' అనే యూనియన్‌లో బాగా తిరిగేవాణ్ణి. అప్పటికే దేవినేని నెహ్రూ, వంగవీటి రంగాల హవా నడుస్తుండేది. బెజవాడ పాలిటిక్స్ రోజుకొక మలుపు తిరుగుతుండేవి. ఒక రోజు - కొందరు రౌడీలు ఎవరిమీదనో దాడి చేయాలనుకుంటూ "ఈ రోజు వాడికి స్పాట్ పెడదాం'' అన్నారు. దీన్నే డైలాగ్‌గా మలిచి విలన్ రామిరెడ్డికి పెడితే ఎలా ఉంటుంది? అనుకుని రాశాను. ఆయన శరీరభాషకు, స్వరూపానికి, మాడ్యులేషన్‌కు ఈ మాట అతికినట్లు సరిపోయింది.
చిత్రం భళారే విచిత్రం
ఒక్కోసారి మనకు తెలియకుండానే విచిత్రాలు జరిగిపోతుంటాయి. 'చిత్రం భళారే విచిత్రం'లో బ్రహ్మానందం చెప్పే 'నీ యంకమ్మా' డైలాగు అలాంటిదే! అప్పటికీ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ డైలాగ్ ఇది. ఈ సినిమాలో దీన్ని వాడటాని కంటే ముందే 'పాప కోసం' అనే చిత్రంలో ఇదే బ్రహ్మానందానికి ఇదే డైలాగును రాశాను. అయితే అప్పుడది ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. 'చిత్రం భళారే విచిత్రం'లో మళ్లీ వాడటంతో.. బాగా పాపులర్ అయ్యింది. కోస్తా సైడు లారీక్లీనర్లు, డ్రైవర్లు దీన్ని ఎక్కువగా వాడేవారు. అలా విన్న మాటనే సినిమాలో పెట్టాను. సెకెండ్ ఆఫ్‌లో బ్రహ్మానందానికి నాగభూషణం మాడ్యులేషన్‌లో రాయాల్సి వచ్చింది. అయితే ఆయన అందుకు ఒప్పుకోలేదు. "ఇప్పుడు రావుగోపాలరావు కదా రన్నింగ్‌లో ఉన్నది. ఆయన మాడ్యులేషన్‌లోరాస్తేనే బావుంటుంది'' అన్నారు. కాని నేను ఒప్పుకోలేదు. 'నాగభూషణమా, రావుగోపాలరావా' ఎవరి మాడ్యులేషన్‌లో రాయాలనేదానికి రెండు చీటీల్లో ఇద్దరి పేర్లు రాసి లాటరీ వేద్దామని ఒక ఒప్పందానికి వచ్చాము. లాటరీలో తీసిన చీటీలో 'నాగభూషణం' అనొచ్చింది. ఒప్పందం ప్రకారం అతని మాడ్యులేషన్‌లోనే రాశాను. అసలు సంగతేంటంటే ఆ రెండు చీటీల్లోను నేను నాగభూషణం పేరే రాశాను. అది బ్రహ్మానందానికి తెలీదు.
ప్రెసిడెంట్‌గారి పెళ్లాం
నాగార్జున సింగిల్‌లైన్ డైలాగ్‌లు చెప్పడం ఈ సినిమాతోనే మొదలు. 'ప్రెసిడెంట్‌గారి పెళ్లాం'లో అలాంటి మాటలు రాసే భాగ్యం కలిగింది నాకు. అందులో నాగార్జున అనే 'ఎత్తి కొడితే ఏట్లో పడతావ్' మాట పెద్ద హిట్ అయ్యింది. పల్లెసీమ నేపథ్యంలో సాగే సినిమా ఇది. అక్కడున్న చెట్టుపుట్టల్ని దృష్టిలో పెట్టుకుని రాయాల్సి వచ్చింది. అందులో కోటశ్రీనివాసరావు సందర్భం వచ్చినప్పుడల్లా "అయ్యో నరకాసురా'' అంటుంటాడు. ఎవరికైనా కష్టమొచ్చినప్పుడు 'అయ్యో రామా, అయ్యో కృష్ణ' అనడం సహజం. అదే మాటను వ్యతిరేకార్థంలో 'అయ్యో నరకాసురా' అని రాస్తే బాగుంటుందనిపించి రాశాను. కోట శ్రీనివాసరావు వాక్చాతుర్యం వల్ల నా డైలాగులకే కొత్త అందం వచ్చింది. ఒక సందర్భంలో విలన్ సత్యనారాయణను (ఆయన పాత్ర పేరు 'దేవుడు') హీరో ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఆయన దగ్గరే పక్కవాయిద్యంలా ఉండే కోట "అసలు దేవుడే అద్దె సైకిల్‌లో తిరుగుతుంటే ఉత్సవవిగ్రహానికి ఎందుకండీ ఊరేగింపు'' అనడం నవ్వు తెప్పిస్తుంది. సత్యనారాయణకు మరో చోట రాసిన డైలాగ్ "అందరి తలరాతలు ఆ దేవుడు రాస్తే.. మీ తలరాతలు ఈ దేవుడు రాస్తాడు'' అనేదీ ప్రేక్షకులకు నచ్చింది.
హీరో ఎదురుపడినప్పుడల్లా హీరోయిన్ మీనా 'ఉమ్మ కావాలి' అనడం ఒక రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్. మలయాళంలో 'ఉమ్మ' అంటే ముద్దు అని అర్థం. ఆ పదాన్నే చరణంగా వాడి 'ఉమ్మ కావాలి' అనే పాటను కూడా పెట్టారు.
అల్లరి అల్లుడు
'అల్లరి అల్లుడు' గుర్తుకొస్తే నాగార్జున గారు నాకిచ్చిన వజ్రపుటుంగరం గుర్తుకొస్తుంది. ఈ సినిమాకు ముందు వచ్చిన ఆయన ఏడు సినిమాలు సరిగా ఆడలేదు. హిట్ కోసం ఎదురుచూస్తున్నారప్పుడు. ఇందులో నగ్మా, మీనా హీరోయిన్లు. వాణిశ్రీ విలన్. ఇంతమంది పెద్ద తారల మధ్య నడిచే సన్నివేశాలకు ఆకట్టుకునేలా రాయడం సవాలు. నాగ్ చెప్పే సింగిల్‌లైన్ డైలాగ్ 'అవ్వారే డవ్వా' ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఒక చోట వాణిశ్రీతో సంవాదం నడుస్తుంది. అప్పుడు ఆయన "ఇరవై అయిదేళ్ల ముందు నేను పుట్టున్నా, ఇరవై అయిదేళ్ల తర్వాత నువ్వు పుట్టున్నా అవ్వారే డవ్వా! ఆ కథే వేరు!!'' అని రెండు చేతులు కొట్టి చెబుతాడు. వాణిశ్రీ పొగరు ముందు ఆ మాట పడకపోతే బాగుండదు. విదేశాలకు వలసలు మొదలైన తొలినాళ్లలో కృష్ణాజిల్లావాసుల ఇళ్లలో ఖరీదైన వ్యవహారం నడుస్తుండేది. ఎవరైనా అతిథులు ఇళ్లకు వెళితే "ఒరే.. అక్కయ్య వచ్చింది. సింగపూరు కప్పులో టీ పట్టుకురా'' అనేవాళ్లు ఆడవాళ్లు. ఇంకొందరైతే "మొన్న ఊటీలో కాఫీ పొడి కొనుక్కొచ్చాను చూడు. దాంతో అమ్మగారికి కాఫీ తీసుకురా'' అనేవారు. ఇవే మాటల్ని వాణిశ్రీకి ఇందులో వాడాను. ఒకసారి వాణిశ్రీకి కోపమొచ్చినప్పుడు "ఒరే సింగపూరు చెప్పుతో మొహం పగలగొడతాను'' అంటుంది. ఇవన్నీ ఇప్పుడు పాతగా అనిపిస్తాయి కానీ అప్పట్లో వాటికి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. సినిమా కూడా నాగార్జున గారు కోరుకున్నట్లు పెద్ద హిట్ కావడంతో ఆయన నన్ను పిలిపించి.. డైమండ్‌రింగ్‌ను బహుమతిగా ఇవ్వడం మరిచిపోలేను.''
పాతిక నాటకాలు రాసి.. వంద నాటకాల్లో వేషం వేసి.. ముప్పై సినిమాల్లో నటించి.. 189 సినిమాలకు డైలాగులు రాసిన అనుభవమేమో తెలియదు కాని.. ఇంటర్వ్యూ అవుతున్నంత సేపు గలగల మాట్లాడుతూ తారీఖులు దస్తావేజులతో సహా చెప్పగలిగారు తోటపల్లి మధు. ప్రస్తుతం ఆయన నాలుగైదు సినిమాల్లో నటునిగా నటించడానికి తేదీలను ఖరారు చేసుకున్నారు. సమయం చిక్కినప్పుడల్లా హైదరాబాదులోని శ్రీనగర్‌కాలనీలో అయిదో అంతస్థుపైనున్న పెంట్‌హౌస్‌లో కూర్చుని హాయిగా పుస్తకాలు చదువుకోవడం ఆయన కాలక్షేపమట.
వాయిస్ ఓవర్
"విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో మేమొక నాటకం వేశాము. దాని పేరు 'ప్రపంచ ప్రేమికులారా ఏకం కండి'. ఆ నాటకాన్ని తిలకించిన బాలచందర్ నన్ను మెచ్చుకుని.. చెన్నై రమ్మని చెప్పారు. ఆ తర్వాత రెండుమూడు సినిమాలకు చేశాక.. చిరంజీవి నటించిన 'దేవాంతకుడు'తో డైలాగ్ రైటర్‌గా తొలి అవకాశం వచ్చింది''
"అయిదేళ్ల వయసులోనే పుట్టపర్తిలో సాయిబాబా ఎదుట నాటకంలో నటించే అదృష్టం కలిగింది. అందులో 'నిమి' అనే మునికుమారుని పాత్ర నాది. దాన్ని చూసిన ఆయన దగ్గరికి తీసుకుని 'నువ్వు పైకొస్తావు బంగారు' అని దీవించారు. ఆ మాటే నాకు జీవితాంతం పాజిటివ్ఎనర్జీని ఇచ్చింది.''
"నేను ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా పెన్ను పేపరు పట్టుకుని డైలాగులు రాయలేదు. నేను చెబుతుంటే నా సహాయకులు రాసుకుంటుంటారు. లేదంటే టేపులో రికార్డు చేస్తుంటాను. అందుకేనేమో సరదాగా "మీరు రైటర్ కాదండీ. డిక్టేటరు'' అని చమత్కరించారు వేటూరి.
"డైలాగులు రాసేప్పుడు నేను ఎవరితోనూ సంవాదం పెట్టుకోను. కేవలం చర్చలు మాత్రమే జరుపుతాను. ఒకటి నచ్చలేదంటే మరొకటి, ఇంకొకటి.. ఇలా పది పదిహేను డైలాగుల్ని చకచకా రాసివ్వగలను. ఒకరకంగా చెప్పాలంటే దర్శకులకు నేనొక సూపర్‌మార్కెట్‌లాంటి వాణ్ణి. అందులో వారికి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. నా మొత్తం కెరీర్‌లో 189 సినిమాలకు అవలీలగా డైలాగులు రాయడానికి కారణం ఇదే!''
ఠి కొన్నిసార్లు ఒకే ఒక డైలాగులో హీరో స్వభావాన్ని చెప్పాల్సి వస్తుంది. 'వేమన చరిత్ర'లో అలాంటి డైలాగ్ రాశాను. వేమనతో ఒకాయన "వేమనా.. సూర్యుడు చూడు.. సూర్యబింబం చూడు అమ్మవారి నుదుటి బొట్టులా లేదూ..'' అంటాడు. అప్పుడు వేమన "లేదు. అన్నార్తుల ఆకలి మంటల గుర్తులా ఉంది'' అని చెబుతాడు. తనెంత విప్లవకారుడో ఆ మాటతోనే అర్థమవుతుంది.
ఠి 'హనుమాన్ జంక్షన్'లో వేణు కొబ్బరికాయ కొట్టగానే అక్కడే నిల్చున్న ఎల్‌బి శ్రీరామ్ తలకు తగిలి దెబ్బతగులుతుంది. అప్పుడు వేణు "అరే రక్తం కారుతోంది'' అంటాడు. ఆ మాటకు "రక్తం కారకుండా రసమూ సాంబారు కారుతుందా'' అని ఎల్‌బి శ్రీరామ్ ఒత్తి పలికి చెప్పే సమాధానం నవ్విస్తుంది.
ఠి 'కృష్ణబాబు' సరిగా ఆడలేదు కాని, అందులో రాశితో బాలయ్య చెప్పే డైలాగు "నువ్వు నిప్పులాంటి దానివి తులసీ. నిన్ను తప్పుపడితే గుడిలోని దేవుడైనా సరే గుండె పగిలి చచ్చిపోతాడు''. నాకిప్పటికీ నచ్చిన మాటల్లో ఇదొకటి.
ఠి 'యముడికి మొగుడు'లో చిరంజీవికి విషం పెడతాడు రావుగోపాలరావు. చనిపోయాడనుకున్నాక.. మెల్లగా కదులుతున్న చిరంజీవిని "నువ్వు చావలేదా'' అంటాడు రావు. "చావులేని వాణ్ణి చిరంజీవి అంటార్రా! ఆ చిరంజీవిని నేనే!!'' అని హీరో డైలాగ్ చెప్పగానే ఇంటర్‌వెల్ పడుతుంది. కథ చెప్పినప్పుడు చిరంజీవిగారికి సైతం ఎంతో నచ్చిన డైలాగ్ ఇది.
ఠి పవర్‌ఫుల్ డైలాగులు చెప్పడంలో చిరంజీవి స్టయిలే వేరు. 'రిక్షావోడు'లో ఆయన 'కాస్కో నా వాస్కోడిగామా' అలాంటిదే! దీనికేమీ అర్థం లేదు. కొన్నిసార్లు నటుణ్ణి బట్టి శబ్దప్రధానంగా రాయాల్సి వస్తుంది.
ఠి పాతకాలంలో కొందరు పెద్దలు ఒక మాటకు ముందు వెనక ఏదో ఒక పదాన్ని తగిలించి మాట్లాడే వాళ్లు. అదే మానరిజాన్ని సినిమాలకు వాడుకున్నాను నేను. 'పెళ్లి నీకు శుభం నాకు'లో కోటశ్రీనివాసరావుకు 'గోవిందా' అనే పదాన్ని అతికించి డైలాగులు రాశాను. అతను ఏం మాట్లాడినా "అయిందా గోవిందా'', "వెళదామా గోవిందా'' అంటుంటాడు. ఇదే స్టయిల్‌లో గిరిబాబుకు 'దరిద్రంగా' అనేపదాన్ని పెట్టాను. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు "రండి రండి భోంచేద్దాం దరిద్రంగా'', "వెళ్లండి వెళ్లండి దరిద్రంగా'' అంటుంటాడు.
 సన్నివేశానికి తగ్గట్టు డైలాగు పడినప్పుడే ఆ పాత్ర ఔచిత్యం తెలుస్తుంది. 'సాక్షి'లో బాధలతో పోరాడుతున్న జయసుధ ఒకసారి "అందరి జీవితాలను ఆ దేవుడు జాలి అనే కలంతో రాస్తే నా జీవితాన్ని మాత్రం కక్ష అనే కత్తితో రాశాడు'' అనడం అలాంటిదే!
ఇంటర్వ్యూ : మల్లెంపూటి ఆదినారాయణ
నవ్య

యుద్దం చేస్తేగానీ... స్వరాజ్యం రాదు


Published at: 12-06-2014 00:35 AM
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య ధాటికి ధీటుగా మన్నెం ప్రజల హక్కుల పరిరక్షణ కోసం.. స్వరాజ్యం కోసం పోరాడిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. అయితే ఆయనతో నేరుగా మాట్లాడి, వాటిని ప్రచురించిన సందర్భాలు అతి తక్కువ. అలాంటి సందర్భం ఒకటి 1923లో చరిత్రలో నమోదయింది. 1923, ఏప్రిల్ 17వ తేదీన సీతారామరాజు తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి వచ్చినప్పుడు-చెరుకూరి నరసింహమూర్తి అనే స్థానికుడు ఆయనను కలిసి మాట్లాడారు. సీతారామరాజుతో నరసింహమూర్తి సంభాషణను, నరసింహమూర్తితో ఆంధ్రపత్రిక విలేకరి సంభాషణను ఆంధ్రపత్రిక ఏప్రిల్ 21వ తేదీన ప్రచురించింది. ఈ ఇంటర్వ్యూలను, సీతారామరాజుకు సంబంధించిన అనేక ఇతర ఆసక్తికరమైన విషయాలను, సూపర్ స్టార్ కృష్ణ తీసిన 'అల్లూరి సీతారామరాజు' సినిమా విశేషాలను సేకరించి సీనియర్ పాత్రికేయుడు యు. వినాయకరావు 'విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు' అనే పుస్తకాన్ని ఇటీవల వెలువరించారు. ఆ పుస్తకంలో నుంచి ఒక ఆసక్తికర భాగం..
అల్లూరి సీతారామరాజు అన్నవరం వెళ్లినపుడు ఆయనతో చెరుకూరి నరసింహమూర్తి జరిపిన సంభాషణ.
మూర్తి: మీరిక్కడ ఎంతసేపు ఉంటారు?
రాజు: రెండు గంటలసేపు ఉంటాను. పది గంటల సమయంలో బయలుదేరుతాను. నర్సీపట్నం, కాకినాడలకు ఎస్ఐ తంతి వార్తలు పంపేందుకు కనీసం అరగంట ఆలస్యం కాక మానదు. ఆపై మాత్రమే పోలీసులు మోటారుబళ్లలో బయలుదేరుతారు. పది గంటల ప్రాంతంలోనే వారంతా ఆ గ్రామానికి చేరగలుగుతారు.
మూ: మీరెక్కడకు వెళ్లదలిచారు?
రా: నేను ముందుగా మకాములను నిర్ణయించుకోలేదు.
మూ: ఇక్కడికి ఎందుకు వచ్చారు?
రా: నా ఉత్తర్వులను అనుచరులు సరిగా గ్రహించలేదు. దారిలో తుపాకులను కాల్చారు. దాంతో నా జాడ తెలుస్తుందేమోనని నా ప్రయాణాన్ని మార్చి వెంటనే ఇక్కడికి వచ్చాను.
మూ: మీరేమి సంకల్పంతో పితూరిని నడుపుతున్నారు?
రా: ప్రజలకు స్వాతంత్య్రం లభించాలనే ఉద్దేశంతో.
మూ: ఏ సాధనంతో?
రా: దౌర్జన్యంతోనే. యుద్ధం చేస్తే గానీ మనకు స్వరాజ్యం రాదు.
మూ: స్వాతంత్య్రం పొందగలమన్న నమ్మకం మీకు ఉందా?
రా: రెండేళ్లలో స్వరాజ్యం తప్పక లభిస్తుందన్న నమ్మకం నాకు ఉంది.
మూ: రెండేళ్లలో స్వరాజ్యమెలా లభిస్తుంది? మీరవలంబిస్తున్న పద్ధతిలోనే స్వరాజ్యం వస్తుందా?
రా: తప్పక వస్తుంది. నాకు అనుచరుల సంఖ్య చాలా ఎక్కువ. అందులో లోటు లేదు. అయితే తుపాకులు, మందుగుండు సామాగ్రి కావాలి. వాటి కోసమే ఈ సంచారం చేస్తున్నాను.
మూ: దౌర్జన్యంతో కూడిన యుద్ధాలతో ప్రపంచం విసుగు చెందింది. దౌర్జన్యరహిత సిద్ధాంతాన్నే ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆదరిస్తున్నారు. జర్మనీవారు కూడా సాత్విక విరోధాన్నే ఆరంభించారు. గాంధీ మహాత్ముడు బోధించిన దౌర్జన్యరాహిత్య సాధనాల్లో మాత్రమే మాకు నమ్మకం ఉంది. సకల ప్రపంచానికి శాంతి మార్గాన్ని బోధించేందుకు దేవదూత గాంధీరూపంలో వచ్చిందని ప్రపంచ ప్రజలంతా నమ్ముతున్నారు.
రా: దౌర్జన్యరాహిత్యంపై నాకు నమ్మకం లేదు. దౌర్జన్యంతోనే స్వాతంత్య్రం సాధించగలమని గట్టిగా నమ్ముతున్నాను.
మూ: దౌర్జన్యంతో ప్రాణనష్టం, వినాశనం కలుగుతుంది. శాంతి సాధనతోనే స్వరాజ్యం లభిస్తుంది. ఇంతకుపూర్వం మీకు, పోలీసులకు జరిగిన యుద్ధాల్లో మీ పరిస్థితి ఎలా ఉంది?
రా: మొదటి అయిదు యుద్ధాల్లో నేను సులభంగా గెలుపొందాను. ఆరోది, చివరి యుద్ధంలో మాత్రం అలసి మేము నిద్రపోతుండగా పోలీసువారు హఠాత్తుగా మాపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. వారు దూరంగా ఉండి మందుపాతరలను, తుపాకులను కాల్చారు. అరగంటసేపు విడవకుండా కాల్చిన శబ్దాలకు మా జట్టులోని వారికి మెలకువ వచ్చింది. మరి రెండు నిమిషాలకు నాకు కూడా మెలకువ వచ్చింది. నేను లేచి చూసేసరికి పోలీసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మా వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. తుపాకి రవ్వలు తగిలి నా పరుపంతా చిల్లులు పడింది. అయితే, నాకు ఒక్కటీ తగలలేదు. మా వారితో కలిసి అక్కడి నుంచి తప్పించుకొన్నాం.
మూ: ఈ నాలుగు నెలలుగా మీరేమి చేస్తున్నారు?
రా: నేను జపం చేస్తున్నాను.
మూ: గయలో జరిగిన కాంగ్రెసు మహాసభలకు మీరు వెళ్లారని ప్రజలు బాగా చెప్పుకొన్నారు. నిజమేనా?
రా: నా స్థూల శరీరం గయకు పోలేదు. నా ఆత్మ మాత్రమే అక్కడికి వెళ్లింది.
మూ: అక్కడ జరిగిన విషయాలన్నీ మీకు తెలియవన్న మాటేనా?
రా: నేనంతా స్వయంగా చూడగలిగాను. అక్కడ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. కొందరు శాసనసభలను బహిష్కరించాలని, మరికొందరు వెళ్లాలని అన్నారు. వెళ్లాలనే వారికి దాసుగారు నాయకుడు. వారి సంఖ్య అల్పం. ఉప్పు పన్నుని హెచ్చించినందుకు, ధర్మాదాయాల చట్టాన్ని ఆమోదించినందుకు భారత శాసనసభ్యుల్లోనూ, చెన్నపురి రాష్ట్రీయ శాసన సంఘ సభ్యుల్లోనూ ఎవరైనా రాజీనామాలు ఇచ్చారా?
మూ: ఎవరూ రాజీనామాలు ఈయలేదు. అసలు మీకీ రాజకీయ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి?
రా: నేను అందుకు తగు ఏర్పాట్లు చేసుకొన్నాను.
విప్లవజ్యోతి
అల్లూరి సీతారామరాజు
రచయిత: యు. వినాయకరావు
పేజీలు: 80, ధర: 100 రూపాయలు
ప్రతులకు: 98851 79428

నవ్య,

నేనుగానీ ఒక ఈలగానీ వేశానంటే...


Published at: 16-06-2014 01:08 AM
మాటలతో మాయ చేసే గారడివిద్య ఆయనకు తెలుసు కాబట్టే 'మాయలోడు'లో ప్రేక్షకులందర్నీ మాయ చేశారు. ఎక్కడ ఏ అక్షరం పడితే బావుంటుందో తక్కెడలో తూకం వేసినట్లు రాయగలరు కాబట్టే 'శుభలగ్నం'లో సెంటిమెంటును పండించారు. పొట్టి మాటలతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించడానికి యముణ్ని సైతం భూలోకంలోకి రప్పించిన ఆయన అక్షర విన్యాసం.. ఎలాంటిదో 'యమలీల' చూస్తే తెలుస్తుంది. ఒక ముక్క మాట్లాడలేని మూగజీవానికి సైతం గుండెకు హత్తుకునే మాటలు రాయొచ్చని 'రాజేంద్రుడు గజేంద్రుడు'తో నిరూపించుకున్నారు. ఫ్యామిలీ, హ్యూమర్, సెంటిమెంట్ డైలాగుల్లో ఆరితేరిన ఆయనే దివాకర్‌బాబు. బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకుని సినిమాల్లోకొచ్చి.. వంద సినిమాలకు మాటలు రాసిన ఆయనే ఈ వారం డైలాగ్‌గురు..

"నువ్వు నీ మొగుణ్ని అమ్ముకుని బంగళా కొన్నావు. నేను నా మొగుణ్ని బతికించుకోవడానికి బంగళా అమ్ముకున్నాను. నువ్వు నాకంటే ఎప్పుడూ పేదదానివే!!''
"కళ్లు వెళ్లిన చోటికల్లా మనసు వెళ్ల కూడదు. మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్లకూడదు''
"ఇంకేం యముండ.
అదుగో గోల్కొండ''
"అమృతం దేవతలు తీసుకుని అమ్మ ప్రేమను మానవులకు ఇచ్చారు. మానవులే అదృష్టవంతులు''
"గల్లీలో నా చెల్లి పెళ్లి. జరగాలి మళ్లీ మళ్లీ''
'పుష్పక విమానం'లో ఒక్క డైలాగు లేదు. కాని ప్రేక్షకులకు అద్భుతంగా అర్థమైంది. చార్లీచాప్లిన్ సినిమాల్లోను మాటలు ఉండవు. ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. దీన్నిబట్టి మనకు అర్థమైంది ఏంటంటే- సినిమాకు డైలాగులు అవసరం లేదని. తెర మీద ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా చెప్పలేనప్పుడు మాత్రమే డైలాగులు రాయాలన్నది నా అభిప్రాయం. ఊరికే సినిమా నిండా వాగుడు వాగుడు వాగుడు ఉండకూడదు. అయితే ఆ ప్రయత్నం.. నా పూర్వీకులు చేయలేదు. నేను చేయలేదు. నా తర్వాత వారు కూడా చేయలేదు.
'శుభలగ్నం' క్లయిమాక్స్ సీను రాయను అని మొండి కేశాను. ఎందుకంటే రాస్తే.. ఈ పాత్రలన్నీ నాకు దూరమైపోయినట్లే లెక్క. అంటే ఆ పాత్రలతో నాకు తెలియకుండానే అంత అనుబంధం ఏర్పడిందన్నమాట.
'ఘటోత్కచుడు'లో ఏవీఎస్‌కు రాసిన.. 'రంగు పడుద్ది' బాగా పాపులర్ అయ్యింది. గుంటూరులో రౌడీబ్యాచు ఈ మాటను అంటుండే వాళ్లు. దాన్ని నేను చిన్నప్పుడు విన్నట్లు గుర్తు. రంగు అంటే రక్తం. అందుకే 'రంగు పడుద్ది' అంటుంటారు.
సినిమాల్లోకి వస్తానని ఏ నాడు అనుకోలేదు. కరూర్ వైశ్యాబ్యాంకులో ఉద్యోగం చేసేవాణ్ణి. చదువుకునే రోజుల నుంచి నాటకాలంటే విపరీతమైన అభిమానం నాకు. నాటకాలు రాయడం, పరిషత్తు పోటీల్లో పాల్గొనడం, ప్రదర్శనలు ఇవ్వడం ఇదే పని. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఇవన్నీ చేసేవాణ్ణి. అయితే బదిలీ మీద విజయవాడకొచ్చాను. ఏదో పని మీద మద్రాసు నుంచి రేలంగి నరసింహారావుగారు ఆ ఊరొచ్చారు. పూసల వెంకటేశ్వరరావు అనే రచయిత నా గురించి ఆయనకు చెబితే ఒకసారి వచ్చి కలవమన్నారు. రేలంగి బస చేసిన హోటల్ గదికి వెళ్లి ఆయన్ని కలిశాను.
ఒక సినిమాకు కథ చెప్పడం అదే ఫస్ట్‌టైమ్. చిన్న లైన్ చెప్పగానే ఆయనకు తెగ నచ్చింది. 'లైన్ బాగుంది. ట్రీట్‌మెంట్ రాసి మద్రాసుకు పంపండి' అన్నారాయన. వెంటనే రాసి పంపించేశాను.
అదే కథతో సినిమా తీస్తున్నట్లు నాకు కబురు పెట్టారు. "డైలాగులు కూడా నేనే రాస్తానండీ'' అని రేలంగిని అడిగితే సరే అన్నారు. అలా 'కొంటెకాపురం'తో డైలాగ్ రైటర్‌గా నా ప్రస్థానం మొదలైంది. అప్పట్లో అది పెద్ద హిట్. చంద్రమోహన్ హీరోగా ఫేడవుట్ అవుతున్న సమయంలో వచ్చిందది. సినిమా రచనలో అనుభవం లేకపోయినా.. నాటకాలకు, దృశ్యమాద్యమానికీ వ్యత్యాసం తెలుసు. ఆ తర్వాత 'డబ్బు ఎవరికి చేదు', 'మన్మధలీల కామరాజు గోల'లకు మాటలు రాశాను. మెల్లగా అవకాశాలు పెరగడంతో.. బ్యాంకు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. అప్పటికి పన్నెండేళ్లు బ్యాంకులో పనిచేశాను. 'శుభలగ్నం', 'యమలీల', 'ఘటోత్కచుడు', 'మావిచిగురు', 'చూడాలనివుంది', 'ఆహ్వానం', 'మాయలోడు', 'రాజేంద్రుడు గజేంద్రుడు' వంటి సూపర్‌హిట్ సినిమాలకు మాటలందించే అవకాశం వచ్చింది. మొత్తం కలిపితే వంద సినిమాలకు డైలాగుల్ని అందించాను నేను. రేలంగి నరసింహారావు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, ఎస్వీ కృష్టారెడ్డి, ముత్యాలసుబ్బయ్య, రవిరాజ పినిశెట్టి, గుణశేఖర్ వంటి దర్శకులతో పనిచేశాను. నాకు గుర్తున్న కొన్ని సినిమాల్లోని కొన్ని డైలాగులు ఇవి.
రాజేంద్రుడు గజేంద్రుడు
కథ సిద్ధమయ్యాక - దర్శకుడు ఎవరైతే బావుంటుంది? అని ఆలోచిస్తున్నాం. "మీరే చేయండి'' అని ఎస్వీ కృష్ణారెడ్డిని ప్రోత్సహించాం. కథ ఆయన రాసిందే కావడంతో తీయడం సులువైంది. అప్పట్లో నేను కేవలం డైలాగులు రాయడం వరకే పరిమితం కాలేదు. స్క్రీన్‌ప్లేను మలచడం, పాత్రలకు ఒక స్వభావాన్ని ఇవ్వడం, కథా చర్చల్లో పాల్గొనడం చేసేవాణ్ణి. ఈ సినిమాకు పనిచేయడం మాత్రం కొత్త అనుభవం. సినిమాలో రాజేంద్రప్రసాద్ ఒక్కరే హీరో కాదు. ఏనుగు కూడా హీరోనే! అది జంతువు కాబట్టి మాట్లాడలేదు. దాని పక్కనున్న క్యారెక్టర్ మాట్లాడే మాటలను బట్టి.. ఏనుగు భావాలను ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఏనుగు తల ఊపితే.. "ఓహో! నువ్వు అలా అనుకుంటున్నావా'' అని పక్క పాత్రలు చెబుతుండాలి. అలా రాయడం చాలా డిఫికల్ట్ ఫీట్. ఇంతకుమునుపు జంతువుల సినిమాలు చాలానే వచ్చాయి. అవన్నీ చూశాను. అయితే ప్రాక్టికల్‌గా వచ్చేసరికి 'రాజేంద్రుడు గజేంద్రుడు'కు మాటలు రాయడం కష్టం అనిపించింది. ఏనుగు బాధ పడుతోంది. ఆ బాధను ఎలా చెప్పాలి? ఏనుగు పక్కనే అత్యంత ప్రీతిపాత్రమైన రాజేంద్రుడు అనే పాత్ర దాని హృదయాన్ని అర్థం చేసుగోలడు అనేది చెప్పగలగాలి. అయితే ఆ విషయం ప్రేక్షకులకు నేరుగా తెలియకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ.. సంభాషణలను రాశాను.
ఇందులో - అలీకి ఒక సన్నివేశముంది 'జంబలకిడిపంబ' తీస్తున్న సమయంలో.. నేను, అలీ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు.. 'జిబ్రిష్ లాంగ్వేజ్'లో ఒక కామెడీ ట్రాక్ చేసి చూపించాడతను. అదే భాష కాదు. ఒట్టి సంజ్ఞలతో చేసే భావవ్యక్తీకరణ.అంతే!
అలీ చేసిన ఆ సీను బాగా గుర్తుండిపోయింది. దాన్నే క్యారెక్టర్‌గా మలిచి 'రాజేంద్రుడు గజేంద్రుడు'లో బ్రహ్మానందానికి పక్కనుండే ఒక పాత్రను పెట్టాను. ఆ పాత్రను అలీనే చేశాడు. అతను మాటి మాటికీ 'ఇంద చాట' అంటుంటాడు. అందులో ఒక్క ముక్క అర్థం కావు. దాని వల్ల బ్రహ్మానందం పడే అవస్థల్ని చూస్తే నవ్వొస్తుంది. వీళ్లిద్దరి మధ్య నడిచే సీన్ల కోసం పెద్ద పెద్ద డైలాగులేమీ రాయలేదు. అందుకే ప్రేక్షకులకు నచ్చింది.
మాయలోడు
ఆ రోజు నాకు జ్వరం వస్తే ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాను. ఎస్వీ కృష్ణారెడ్డి 'రాజేంద్రుడు గజేంద్రుడు' క్యాసెట్టును పంపిస్తే.. డీవీడీ ప్లేయర్‌లో వేసుకుని చూస్తున్నానప్పుడు. నా పక్కనే మసాజ్ చేసే వ్యక్తి కూర్చున్నాడు. సినిమాను చూస్తూ.. కొన నాలుకను బయటికి చాపి.. కనుబొమలు పైకి ఎగరేసి.. ఒక విచిత్రమైన ఫేసు పెట్టాడు. ఆ దృశ్యం చూస్తున్నంత సేపు.. "ఇతను మెచ్చుకుంటున్నాడా? లేదంటే వెక్కిరిస్తున్నాడా?'' అనేది అర్థం కాలేదు. ఇదే భావనను తీసుకుని క్యారెక్టరైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అలా పుట్టిందే 'మాయలోడు'లో బ్రహ్మానందం పక్కనుండే అలీ క్యారెక్టర్. బ్రహ్మానందం ఏం మాట్లాడినా నాలుక బయటపెట్టి కనుబొమలు పైకెగరేసి.. మౌనంగానే తలను అటూఇటూ ఆడిస్తుంటాడు అలీ. అతని వింత ఎక్స్‌ప్రెషన్స్‌కి ప్రేక్షకులు నవ్వి నవ్వి ఊగిపోయారు. ఒకసీనులో అమ్మాయిలతో హోటల్‌లో కలిసి భోంచేసిన బ్రహ్మానందం బిల్లు కట్టలేక పిండి రుబ్బాల్సి వస్తుంది. అప్పుడు అలీ నాలుక బయటపెట్టి తల ఆడించే విన్యాసం అద్భుతంగా నవ్వించింది. ఆ సీనుకు డైలాగులు అవసరం లేదనే రాయలేదు. ఒక వేళ అలీకి మాటలుండి ఉంటే అంత నవ్వించగలిగేది కాదు ఆ సన్నివేశం. ఆ కిటుకు రచయితకు తెలిసుండాలి. డైలాగు రైటర్ ప్రతి పాత్రను వాగుడుకాయ చేయకూడదు.
'నేను గానీ ఒక ఈలగానీ వేశానంటే' అంటూ రాజేంద్రప్రసాద్ రోడ్డు మీద గారడివిద్య చేసి మూటముల్లె సర్దుకుని వెళ్లిపోయే సీను అది. జనం వెళ్లిపోయినా.. అక్కడొకచిన్న పిల్ల దిగులు ముఖం పెట్టుకుని కూర్చునుంటుంది. 'ఏంటమ్మ నువ్వు ఇక్కడ కూర్చున్నావు?' అనడిగితే.. "మా మమ్మీడాడీని మా మావయ్య చంపేశాడు..'' అని ఏడ్చినంత పని చేస్తుంది. అంతవరకు రాజేంద్రప్రసాద్ చేసిన గారడి విద్యలు నిజమని నమ్మిన ఆ పిల్ల 'నువ్వుగానీ ఒక ఈలగానీ వేస్తే మా అమ్మానాన్నా వస్తారుగా' అని ఆశగా అడుగుతుంది. ఆ చిన్న సన్నివేశం ప్రేక్షకుల గుండెల్ని తాకింది.
మరొక సీను - రాజేంద్రప్రసాద్ నిరక్షరాస్యుడు. అంధురాలైన అమ్మాయిని చేరదీసుంటాడు. ఒకసారి తన పేరు రాయమని కోరతాడు. అప్పుడు ఆ అమ్మాయి పలకలో రాస్తుంది. పక్కనున్న వ్యక్తితో రాజేంద్రప్రసాద్ "ఏంట్రా కరెక్టుగా రాసిందా'' అని అడుగుతాడు. "గాడు అని రాసిందిరా'' అంటాడతను. వీరబాబు 'గాడు' (సినిమాలో తన క్యారెక్టర్‌పేరు) అని రాసిందా'' అని అంటాడు రాజేంద్రప్రసాద్. అప్పుడు ఆ వ్యక్తే మళ్లీ 'జిఒడి గాడ్ అని రాసింది'' అని చెప్పగానే హీరో కళ్లలో నీళ్లు మెదులుతాయి. అంటే ఆ పిల్ల తనను దేవునిగా భావిస్తోంది అని చెప్పడం ఆ చిన్న డైలాగు ఉద్దేశం. అంతకంటే మరొక్క మాట అక్కడ అక్కర్లేదు.
సినిమా అన్నది 'మేక్ బిలీఫ్'. ప్రేక్షకులు చూస్తున్నంతసేపు వాళ్లను నమ్మిస్తే చాలు. 'మాయలోడు'లో పెద్ద ఫ్లా యేంటో మేకర్స్‌గా మాకు తెలుసు. కాని అంతవరకు ఆలోచించకుండా ప్రేక్షకులను మాయ చేయగలిగాము. గారడీ తెలిసిన రాజేంద్రప్రసాద్ అవసరం అనుకుంటే టక్కున మాయమైపోగలడు. మనుషుల్ని కప్పల్ని, కుక్కల్ని, పిల్లుల్ని చేయగలడు. కాని ఇంట్లో వున్న గుడ్డి పిల్లకు మాత్రం కళ్లు తెప్పించలేడు. మరేమిటి నాన్సెన్సు. తనకున్న విద్యతో ఆ పిల్లకు కళ్లు తెప్పించొచ్చుగా! అని ప్రేక్షకుడు ప్రశ్నిస్తే? అన్న తర్కం రాకుండా సీన్లు రాయాల్సొచ్చింది. ఆఫ్ ద స్క్రీన్ ఆఫ్ ద మైండ్. స్క్రీన్ మీద చూపించిందే ప్రేక్షకుడు నమ్ముతాడు. దాని వెనకున్నది నమ్మడు.
శుభలగ్నం
దీనికి కథ భూపతిరాజా. 'ఇన్‌డీసెంట్ ప్రపోజల్' అనే ఆంగ్ల చిత్రం నుంచి కథను తీసుకున్నారాయన. ఆ కథలో కోటి రూపాయలకు భార్యను అమ్మేస్తాడు ఓ భర్త. అదే కథను తెలుగులో తిప్పి రాశాడు రాజా. కాబట్టే 'శుభలగ్నం'లో భర్తను అమ్ముకుంటుంది భార్య. నాకు కథ వినిపించాక.. మీరు నమ్ముతారో లేదో కాని.. కేవలం మూడంటే మూడు రోజుల్లోనే చకచకా మాటలన్నీ రాసేశాను. ఇందులో ఆమని పాత్రకు చిన్న అమాయకత్వం కనక జోడించకపోయుంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యుండేది. ఆమనిది సాధారణ గృహిణులు ఆశపడే స్వభావం. ప్రతిదాన్నీ పక్కవాళ్లతో పోల్చుకోవడం ఆమె నైజం. మాట మాటకు ఆఖర్న 'ఏమిటో..' అంటూ దీర్ఘం తీసి చెప్పే ఆమె మానరిజం అప్పట్లో అందరి మెప్పు పొందింది.
భర్తను కోటి రూపాయలకు అమ్మేసిన ఆమని.. ఒక ఖరీదైన బంగళా కొంటుంది. ధగధగలాడే నగలు ధరించి, పట్టుచీర కట్టుకుని.. దర్జా ఒలకబోస్తుంటుంది. ఆ సమయంలో బంగళాను అమ్మేసిన సుహాసిని అక్కడికొస్తుంది. ఆవిడను చూసిన ఆమని "నా వైభోగం చూసిపోదామని వచ్చావా ఏమిటి?'' అంటుంది. "లేదు పనివాళ్లు అన్ని సామాన్లు తీసుకెళ్లారు. నా భర్త ఫోటో మాత్రం ఉంది. అది స్వయంగా తీసుకెళదామని వచ్చాను'' అని చెబుతుంది సుహాసిని. మళ్లీ ఆమని కలుగజేసుకుని "ఉన్నదాంట్లోనే తృప్తిగా బతుకు అని చెప్పావుగా. ఇప్పుడు ఉన్నదాన్నే అయ్యాను. నీకంటే గొప్పదాన్నని ఇప్పుడైనా ఒప్పుకుంటావా?'' అని ఆమని కాస్త పొగరు స్వరంతో చెబుతుంది. "నువ్వు నీ మొగున్ని అమ్ముకుని బంగళా కొన్నావు. నేను నా మొగున్ని బతికించుకోవడానికి బంగళా అమ్ముకున్నాను. నువ్వు నాకంటే ఎప్పుడూ పేదదానివే!!'' అని సుహాసిని చెప్పే డైలాగ్ ఆమనిని ఆలోచనలో పడేస్తుంది.
ఆ రోజు పెళ్లి రోజు. పేకాటలో మునిగిపోయిన ఆమని ఆ సంగతిని మరిచిపోతుంది. ఆటలో గుర్తుకొచ్చి వెంటనే ఇంటికి పరిగెత్తుకొస్తుంది. అప్పటికే రెండో భార్య రోజాను తీసుకుని బయటికి వెళ్లుంటాడు జగపతిబాబు. ఇంటికొచ్చిన ఆమని గబగబ మేడ మీదికి ఎక్కి మొగుడి కోసం వెతుకుతుంది. లేడని తెలుసుకుని విసుగుతో మెట్లు దిగుతూ కిందికొస్తుంటే.. అక్కడే ఉన్న వాళ్లమ్మ అన్నపూర్ణ "ఇంతకన్నా దిగిపోవడానికి నీకు మెట్లు లేవమ్మా'' అంటుంది. ఆ ఒక్క చిన్న డైలాగు ఆ సన్నివేశానికి ఎంత బలాన్ని అందించిందో చెప్పలేను. డబ్బు కోసం మొగున్ని అమ్ముకుని.. అతను లేని లోటును మెల్లగా తెలుసుకుంటున్న ఆమె.. రియలైజేషన్‌లోకి వెళ్లిందీ అని చెప్పటానికి ఆ మాట తోడ్పడింది.
అది క్లయిమాక్స్ సీను - డబ్బు మీద ఆశ చచ్చిపోయి ఉన్నదంతా అనాధాశ్రమానికి రాసిచ్చేసి.. విదేశాలకు వెళుతున్న మొగుడి కోసం ఎయిర్‌పోర్టుకు వస్తుంది ఆమని. అక్కడ రోజా, జగపతిబాబు మధ్య ఒక సీనుంటుంది. పరాయి మొగుడి మీద ఆశ పడటం ఎంత తప్పో తెలుసుకున్న రోజా.. "కళ్లు వెళ్లిన చోటికల్లా మనసు వెళ్ల కూడదు. మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్లకూడదు'' అని చెబుతుంది. ఈ డైలాగే కాదు. ఇందులోనివన్నీ చాలా క్లుప్తంగా ఉంటూనే, శక్తివంతగా అనిపిస్తాయి. కాబట్టే సామాన్యప్రేక్షకుల హృదయాలను పట్టుకున్నాయవి. నేనెక్కడా ఇందులో పంచ్‌లు పడాలని మాటలు రాయలేదు. ఆ సందర్భానికి ఆ పాత్ర మనసులో ఏముంది? ఏం మాట్లాడితే బాగుంటుంది? అన్నదాన్ని దృష్టిలో పెట్టుకునే రాశాను.
చూడాలని ఉంది
చిరంజీవి ఒక పెద్ద మాస్ హీరో. అయినాసరే చాంతాడంత మాటలు రాయలేదు. సౌందర్య తన ట్రంకుపెట్టెలో దాచుకున్న ప్రేమలేఖను చదివి వినిపించే సీనొకటి అద్భుతంగా పండింది.(మొదటిపేజీ తరువాయి)
ఆమెకు ఇదివరకు ఎవరో లవ్‌లెటర్ రాస్తే దాన్ని పెట్టెలో నుంచి అపురూపంగా బయటికి తీస్తుంది. లేఖను చదవమంటాడు చిరంజీవి. అప్పుడు సౌందర్య సిగ్గుతో కూడిన అమాయకపు ముఖంతో.. గొంతు సవరించుకుని.. లేఖ తీసుకుని.. "పద్మావతీ పద్మావతీ.. నీ ఎర్రని మూతి.. చూడగానేపోయింది నా మతి'' అని చదువుతూ మెలికలు పోతుంది. చదవడం అయిపోగానే "చూశావా నా కోసం రక్తంతో రాశాడు'' అంటుందామె. "అబ్బో అంత కలర్ ఇచ్చాడా?'' అంటాడు చిరు.
డైలాగుల కోసమని డైలాగులను నేనెప్పుడూ రాయను. పొదుపుగా రాయడం అలవాటు. ఒక సీనులో విలన్ అనే ఒకే ఒక్క మాటతో హీరో గొప్పతనాన్ని తెలియజెప్పాల్సిన సీను అది. ఒక పాత సినిమాలో ఎస్వీ రంగారావు రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో "నీకు మరణమే శరణ్యం. నీకు.. మరణమే.. శరణ్యం. నీకు.. మరణమే... శరణ్యం'' అనే డైలాగును అద్భుతంగా చెబుతాడు. ఏకవాక్యాన్నే మొదట మెల్లగా, రెండోసారి ఇంకాస్త గట్టిగా, మూడోసారి మరికాస్త గట్టిగా హైపిచ్‌లో చెప్పాలి దీన్ని. అదే భావోద్వేగంతో 'చూడాలనివుంది'లో విలన్ ప్రకాష్‌రాజ్‌కు డైలాగును రాశాను. "మీరొకసారి ఎస్వీరంగారావు గారి సినిమా చూస్తారా? అందులో ఆయన ఎలా చెప్పారో తెలుస్తుంది'' అన్నాను ప్రకాష్‌రాజ్‌తో. అయితే ఆయన "వద్దండీ నేను చూడను. చూస్తే ఆయన ఇమేజ్ నా మీద పడుతుంది. నేను నా సొంత స్టయిల్‌లోనే చెబుతాను'' అన్నారు. అప్పుడు ఆయనకు రాసిన డైలాగ్.. "వాడు సామాన్యుడు కాడు. వాడు సామాన్యుడు కాడు. వాడు సామాన్యుడు కాడు''. ప్రకాష్‌రాజ్ చెప్పిన ఆ డైలాగ్ హీరో రేంజ్‌ను పెంచింది.
యమలీల
ఒక్కోసారి రచనకు లొకేషన్లు కూడా పనికొస్తాయి అనేందుకు ఇందులోని ఒక సీను నిదర్శనం. ఈ స్క్రిప్టు నేను మద్రాసులోనో ఇంకోచోటో కూర్చుని రాసుంటే ఎలా రాసుండేవాన్నో తెలీదు. భవిష్యవాణి పుస్తకాన్ని పొరపాటున భూలోకంలోకి జారవిడచడంతో.. ఇంద్రుడు శపిస్తాడు. దాంతో యముడి వేషం వేసిన సత్యనారాయణ, చిత్రగుప్తుడైన బ్రహ్మానందం భవిష్యవాణి కోసం.. భూలోకంలోకి వస్తున్న సన్నివేశం అది. "శాపం పడితే పడింది కాని మనకు సెలవు దొరికింది'' అని చమత్కరిస్తాడు చిత్రగుప్తుడు. అందుకు కోపమొచ్చిన యముడు "యముండా.....!!!!'' అని ఘీంకరిస్తాడు. "ఇంకేం యముండ. అదుగో గోల్కొండ'' అని బ్రహ్మానందం చెప్పిన డైలాగుకు థియేటర్లన్నీ విజిళ్లతో మోగిపోయాయి. వాళ్లిద్దరు భూలోకంలోకి వచ్చారు అని చెప్పడానికి గోల్కొండను చూపించడం నా ఉద్దేశం. యముండకు, గోల్కొండకు ధ్వని కూడా బాగా కుదిరింది. ఈ డైలాగును హైదరాబాద్‌లో కూర్చుని రాశాను కాబట్టే ఈ ఐడియా వచ్చింది. ఇంకోచోట అయ్యుంటే వచ్చేది కాదేమో!
ఇంకో సీనులో అమ్మ గొప్పతనాన్ని చెప్పాల్సొచ్చింది. భూలోకంలో యముడు భోజనం చేస్తుంటాడు. అప్పుడతను "అమృతం దేవతలు తీసుకుని అమ్మ ప్రేమను మానవులకు ఇచ్చారు. మానవులే అదృష్టవంతులు'' అంటాడు. ఆ డైలాగు ప్రేక్షకుల మన్నన పొందింది. ఇంకో సీనులో యముడు ఒక తాగుబోతును తన సహజసిద్ధ ధోరణిలో 'మానవా' అని పిలుస్తాడు. అప్పుడు 'మానను' అంటాడు ఆ తాగుబోతు.
'యమలీల'లో అందరికీ గుర్తున్న కవిత ఒకటుంది. తనికెళ్ల భరణి "గల్లీలో నా చెల్లి పెళ్లి. జరగాలి మళ్లీ మళ్లీ'' అనేదే ఆ కవిత. ఆ సినిమా తర్వాత ఈ కవితకు వచ్చిన పాపులారిటీ అంతాఇంతా కాదు. అందర్నీ బాగా నవ్వించింది. ఇప్పటికీ నవ్విస్తోంది..'' అని ముగించారు దివాకర్‌బాబు.
ప్రస్తుతం మణికొండలో కొత్తగా కట్టుకున్న ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారాయన. సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ విశ్రాంత జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. 'మీరు ఇప్పుడేమీ రాయడం లేదా' అంటే 'ప్రతి మనిషీ ఒక చోట ఆగాల్సి వస్తుంది. అది ఎవరికైనా తప్పదు. ఇప్పుడొస్తున్న సినిమాలకు మాలాంటి వాళ్లం రాయలేము. బూతులు అసలే రాయలేను..'' అని నవ్వుకుంటూ చెప్పుకొచ్చారీ సక్సెస్‌ఫుల్ డైలాగ్ రైటర్.
ఇంటర్వ్యూ: మల్లెంపూటి ఆదినారాయణ

Tuesday, June 17, 2014

సింగిల్ లైన్

స్టార్ హీరోలు కదా అని స్టోరీని మరిచి డైరెక్టర్ చెప్పిన సింగిల్ లైన్ తో సినిమాకు ఓకే చెప్పడంతో ప్రొడ్యూసర్స్ అప్పుల పాలవుతున్నారు.

సింగిల్ లైన్ చదివితే మీకు దైవం మానుషరూపేణా అని ఖలేజా సినిమా లైన్ గుర్తొస్తుంది కదా. ఇదే లైన్ తో తీసినా దానిచుట్టూ కథా కథనాలను అల్లుకోవడంలోనే దర్శకుడుగా క్రిష్ ప్రతిభ మనకు స్పష్టంగా తెలుస్తుంది.

ఒక నటుడిగా, రచయితగా, దర్శకుడిగా సురభి నాటక రంగానికి తన జీవితాన్ని అంకితం చేసి తన ఇంటి పేరుగా మార్చుకున్న సురభి సుబ్రహ్మణ్యం(కోటా శ్రీనివాసరావు) గారి మనవడై ఉండి కూడా ఆయన సిద్దాంతాలని ఏమాత్రం లెక్కచేయకుండా కళారంగం తిండిపెట్టదనీ, మోసం చేసైనాసరే తను అమెరికా వెళ్ళి స్థిరపడితే చాలనీ, ఎవడి బతుకు వాడు బతకాలని నమ్మే బి.టెక్.బాబు(రాణా) తన అభిప్రాయం తప్పనీ, మనిషి సంఘజీవి అనీ, తోటి మనిషికి సాయం చేయడమే దైవత్వమనీ, భగవంతుడి దశావతారాల సారం ఇదేననీ స్వానుభవంతో తెలుసుకుని మైనింగ్ మాఫియా గుప్పిట చిక్కుకున్న ఒక ప్రాంతానికి ఎలా సాయం చేశాడో తెలియజెప్పే కథే “కృష్ణం వందే జగద్గురుం”. ఈ సింగిల్ లైన్ చదివితే మీకు దైవం మానుషరూపేణా అని ఖలేజా సినిమా లైన్ గుర్తొస్తుంది కదా. ఇదే లైన్ తో తీసినా దానిచుట్టూ కథా కథనాలను అల్లుకోవడంలోనే దర్శకుడుగా క్రిష్ ప్రతిభ మనకు స్పష్టంగా తెలుస్తుంది.  

పోటుగాడు... కథ ఏంటి..?

సింగిల్‌ లైన్‌లో కథ చెప్పుకోవాలంటే... ఆత్మహత్య చేసుకోవాలని ఎత్తయిన కొండపైకి వచ్చిన గోవిందం(మనోజ్‌) హాయిగా మందులో పురుగులుమందు కలుపుకుని తాగేస్తాడు. అదే టైమ్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వెంకట్‌(పోసాని కృష్ణమురళి) కూడా వచ్చి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఒకరినొకరు చూసుకుని తామెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో చెప్పుకుంటారు. జల్సారాయుడు గోవిందం.. తద్దినాలు పెట్టే కుటుంబంలో నుంచి వచ్చాడు. లవ్‌ చేయడమంటే మహా సరదా. నలుగురు అమ్మాయిల్ని రకరకాలుగా ప్రేమించేసి వారి నుంచి దూరమవుతాడు. వెంకట్‌ మాత్రం సహోద్యోగిని ప్రేమించి మోసపోతాడు. మరి గోవిందం ఆత్మహత్యకు ఓ బలమైన కారణముంటుంది. అది ఏమిటనేది మిగిలిన కథ.

సింగిల్ లైన్ కథ

సింగిల్ లైన్ కథని పకడ్బందీగా అల్లుకోవటంలోనే ఉంటుంది కథకుడి సామర్థ్యం

ఒక్క ముక్కలో ‘కథేంటి?’

సినిమా రచయిత కథ చెప్పడానికొచ్చినప్పుడు ముందుగా దర్శక, నిర్మాతలు ఒక్క ముక్కలో ‘కథేంటి?’ అని అడగడం పరిపాటి. కథారచయిత కూడా కాలహరణం చేయకుండా దానికి సమాధానం నాలుగు ముక్కల్లో చెప్తే దాన్ని బట్టి ఆ కథ తమ అభిరుచికి తగిందో కాదో, ప్రేక్షకులను ఆకట్టుకోగలదో లేదో, ఆ కథను సినిమాగా తియ్యొచ్చోలేదో వారికి ఒక అంచనా ఏర్పడుతుంది. ఉదాహరణకు “లంచగొండి అధికారులను ఒక్కొక్కరినీ హీరో చంపుకుంటూ పోవడమే” భారతీయుడు, ఠాగూర్, అపరిచితుడు - ఈ మూడు సినిమాల ఇతివృత్తం. అంటే మూడు సినిమాల ఇతివృత్తం ఒకటే! కానీ కథాంశాలు మాత్రం వేర్వేరు. (ఈ మూడు సినిమాల్లోని హీరోల్లో ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన నేపథ్యం. అందుకే అవినీతిపరులను చంపడానికి వారెంచుకున్న మార్గాలు విభిన్నమైనవి. ఆ మార్గాలే ఆయా కథాంశాల్లో వైవిధ్యాన్ని తీసుకొచ్చి ఘనవిజయాలు సాధించాయి.) స్వాతంత్ర్య సమరంలో INA తరపున బ్రిటిష్ వారితో పోరాడిన సైనికుడు స్వాతంత్ర్యానంతర భారతదేశంలో వేళ్ళూనుకునిపోయిన అవినీతిపై సాగించిన పోరాటమే భారతీయుడు కథాంశం. సంఘంలోని అవినీతిని సహించలేని, నేరుగా ఎదుర్కొనే ధైర్యమూ లేని సంప్రదాయకుటుంబానికి చెందిన బ్రాహ్మణయువకుడిలో ఉండే ఎవరికీ తెలియని మరో మనిషి split personality ద్వారా బయటికొచ్చి ఆ అవినీతిపరులను ఎలా ఎదుర్కొంటాడో, వారిని ఎలా శిక్షిస్తాడో మనస్తత్వశాస్త్రపరంగా చూపించడమే అపరిచితుడు కథాంశం. ఇలా మొదటగా నాలుగు ముక్కల్లో రాసుకునే కథనే సింగిల్ లైన్ స్టోరీ అంటారు. తర్వాత తీయబోయే పధ్నాలుగు రీళ్ళ సినిమాకు మార్గదర్శిగా ఉండేది ఈ నాలుగు ముక్కల సింగిల్ లైన్ స్టోరీయే. తర్వాతి దశలో ఈ నాలుగు ముక్కల కథను నాలుగు పేజీల కథగా రాసుకుంటారు

సింగల్ లైన్ స్టోరీ


ఒక హీరోని, అతని ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక కధ రాసుకుంటే చివరికి కధకు పలానా హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే  కష్టమంతా వృధా అయిపోతుంది. దీన్ని నివారించడానికి ప్రస్తుతం
హీరోకి ఒక సింగల్ లైన్ లో స్టొరీ చెప్పడం.. అది నచ్చితే ప్లాట్ మీద స్క్రిప్ట్ డెవలప్ చేయడం ప్రస్తుత ట్రెండు

ఒక హీరోని, అతని ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక కధ రాసుకుంటే చివరికి ఆ కధకు పలానా హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే  కష్టమంతా వృధా అయిపోతుంది. దీన్ని నివారించడానికి ప్రస్తుతం తరం డైరెక్టర్ లు సింగల్ లైన్ స్టోరీ లపై దృష్టిపెట్టారు 
హీరోకి ఒక లైన్ లో స్టొరీ చెప్పడం.. అది నచ్చితే ఆ ప్లాట్ మీద స్క్రిప్ట్ డెవలప్ చేయడం ప్రస్తుత ట్రెండు. ఈ ట్రెండ్ ని తూచ తప్పకుండా ఫాలో అయ్యే దర్శకుడు పూరి జగన్నాధ్. డేట్ లు లేక మహేష్ తో తీయవలిసిన సినిమా వాయిదాపడడంతో మనోడు జూ ఎన్.టి.ఆర్ కి ఒక స్టొరీలైన్ వినిపించాడు. అది ఎన్.టి.ఆర్ కి నచ్చేయడంతో స్క్రిప్ట్ పనిమీద బ్యాంకాక్ వెళ్ళిన పూరి ఆ పనిని ముగించుకున్నాడు 
- See more at: http://www.tollywoodtimes.com/telugu/newsfullstory/j65yq3tr27/Andhravala-kosam-kastapadutunna-bangkok-vala/4892#sthash.CcpvFcBj.dpuf
ఒక హీరోని, అతని ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక కధ రాసుకుంటే చివరికి ఆ కధకు పలానా హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే  కష్టమంతా వృధా అయిపోతుంది. దీన్ని నివారించడానికి ప్రస్తుతం తరం డైరెక్టర్ లు సింగల్ లైన్ స్టోరీ లపై దృష్టిపెట్టారు 
హీరోకి ఒక లైన్ లో స్టొరీ చెప్పడం.. అది నచ్చితే ఆ ప్లాట్ మీద స్క్రిప్ట్ డెవలప్ చేయడం ప్రస్తుత ట్రెండు. ఈ ట్రెండ్ ని తూచ తప్పకుండా ఫాలో అయ్యే దర్శకుడు పూరి జగన్నాధ్. డేట్ లు లేక మహేష్ తో తీయవలిసిన సినిమా వాయిదాపడడంతో మనోడు జూ ఎన్.టి.ఆర్ కి ఒక స్టొరీలైన్ వినిపించాడు. అది ఎన్.టి.ఆర్ కి నచ్చేయడంతో స్క్రిప్ట్ పనిమీద బ్యాంకాక్ వెళ్ళిన పూరి ఆ పనిని ముగించుకున్నాడు 
- See more at: http://www.tollywoodtimes.com/telugu/newsfullstory/j65yq3tr27/Andhravala-kosam-kastapadutunna-bangkok-vala/4892#sthash.CcpvFcBj.dpuf
ఒక హీరోని, అతని ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక కధ రాసుకుంటే చివరికి ఆ కధకు పలానా హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే  కష్టమంతా వృధా అయిపోతుంది. దీన్ని నివారించడానికి ప్రస్తుతం తరం డైరెక్టర్ లు సింగల్ లైన్ స్టోరీ లపై దృష్టిపెట్టారు 
హీరోకి ఒక లైన్ లో స్టొరీ చెప్పడం.. అది నచ్చితే ఆ ప్లాట్ మీద స్క్రిప్ట్ డెవలప్ చేయడం ప్రస్తుత ట్రెండు. ఈ ట్రెండ్ ని తూచ తప్పకుండా ఫాలో అయ్యే దర్శకుడు పూరి జగన్నాధ్. డేట్ లు లేక మహేష్ తో తీయవలిసిన సినిమా వాయిదాపడడంతో మనోడు జూ ఎన్.టి.ఆర్ కి ఒక స్టొరీలైన్ వినిపించాడు. అది ఎన్.టి.ఆర్ కి నచ్చేయడంతో స్క్రిప్ట్ పనిమీద బ్యాంకాక్ వెళ్ళిన పూరి ఆ పనిని ముగించుకున్నాడు 
- See more at: http://www.tollywoodtimes.com/telugu/newsfullstory/j65yq3tr27/Andhravala-kosam-kastapadutunna-bangkok-vala/4892#sthash.CcpvFcBj.dpuf
ఒక హీరోని, అతని ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక కధ రాసుకుంటే చివరికి ఆ కధకు పలానా హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే  కష్టమంతా వృధా అయిపోతుంది. దీన్ని నివారించడానికి ప్రస్తుతం తరం డైరెక్టర్ లు సింగల్ లైన్ స్టోరీ లపై దృష్టిపెట్టారు 
హీరోకి ఒక లైన్ లో స్టొరీ చెప్పడం.. అది నచ్చితే ఆ ప్లాట్ మీద స్క్రిప్ట్ డెవలప్ చేయడం ప్రస్తుత ట్రెండు. ఈ ట్రెండ్ ని తూచ తప్పకుండా ఫాలో అయ్యే దర్శకుడు పూరి జగన్నాధ్. డేట్ లు లేక మహేష్ తో తీయవలిసిన సినిమా వాయిదాపడడంతో మనోడు జూ ఎన్.టి.ఆర్ కి ఒక స్టొరీలైన్ వినిపించాడు. అది ఎన్.టి.ఆర్ కి నచ్చేయడంతో స్క్రిప్ట్ పనిమీద బ్యాంకాక్ వెళ్ళిన పూరి ఆ పనిని ముగించుకున్నాడు 
- See more at: http://www.tollywoodtimes.com/telugu/newsfullstory/j65yq3tr27/Andhravala-kosam-kastapadutunna-bangkok-vala/4892#sthash.CcpvFcBj.dpuf

“అత్తారింటికి దారేది”

తెలుగులో అత్తా అల్లుళ్ళ సినిమాలు అదీ ఒక స్టార్ హీరో అల్లుడు కారెక్టర్ వేస్తున్నాడంటే సాధారణంగా మరదలితో పెళ్ళే అల్టిమేట్ గోల్ గా ఉంటాయి. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే అత్తని ఒక దుర్మార్గురాలిగా చూపించి హీరో తన పొగరణచడానికి మరదలు(ళ్ళ)తో పాటు అత్తతో కూడా సరసాలాడటం, డబల్ మీనింగ్ డైలాగులు/సీన్లు ఇలా నానా చెత్తతో నింపేస్తారు.“అత్తారింటికి దారేది” సినిమాకోసం అదే మూసలో వెళ్ళకుండా... ప్రేమ పెళ్ళి చేసుకుని తండ్రిమీద అలిగి ఇల్లొదిలి వెళ్ళిపోయిన అత్తని తన తాత కోరికపై తిరిగి తమ ఇంటికి తీస్కురావడినికి వెళ్ళే మేనల్లుడు అనే ఒక డిఫరెంట్ త్రెడ్ ని ఎన్నుకుని  మార్కులు కొట్టేశారు.