పోలీస్ పవరుకు రజతోత్సవం!

అన్యాయాన్ని
తుదముట్టించగలిగిన వాడే పోలీస్ ఆఫీసర్. కరడుగట్టిన రౌడీయిజాన్ని
మట్టికరిపించడమే అతని ముందున్న కర్తవ్యం. ఈ అంశంతో ‘అంకుశం’ చిత్రాన్ని
వెండితెరపై ఆవిష్కరించారు శ్యామ్ ప్రసాద్‌రెడ్డి. రాజశేఖర్‌కు యాంగ్రీ
యంగ్ మ్యాన్‌గా గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రమిది. కోడి రామకృష్ణ
దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే రామిరెడ్డి విలన్‌గా తెరకు పరిచయమయ్యారు. ఈ
చిత్రాన్ని ‘ఇదుదాండా పోలీస్’ పేరుతో రాజశేఖర్ తమిళంలోకి అనువదించి మంచి
పేరును తెచ్చుకున్నారు. చిరంజీవి హిందీలో అడుగుమోపిందీ ఈ సినిమా కథతోనే.
కన్నడ, బెంగాలీలోనూ రూపొందిన ఈ సినిమా ఆదివారానికి పాతిక వసంతాలను పూర్తి
చేసుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ‘చిత్రజ్యోతి’తో
ఆనాటి అంశాలను ముచ్చటించారు. పవర్‌ఫుల్ జ్ఞాపకాలను పదిలంగా
చెప్పుకొచ్చారు. ఆ వివరాలు...
‘‘నేను, కోడి రామకృష్ణ, రాజశేఖర్.. అందరూ కుర్రవాళ్లం. ఉడుకు రక్తంతో ఉండేవాళ్లం. ఓ వైపు టి.కృష్ణ సినిమాలు.. మరో వైపు సామాజిక బాధ్యతలను గుర్తుచేసే సినిమాలు... ఆ తరుణంలో మేం తెరకెక్కించిన సినిమానే ‘అంకుశం’. కథ గురించి అనుకోగానే చాలా బాగా నచ్చింది. అందులోని సీఎం పాత్ర ఎవరు వేస్తే బావుంటుందా? అని చాలా ఆలోచించాం. ‘నాన్నగారిని(ఎమ్మెస్ రెడ్డి) ఒప్పించండి’ అని కోడిరామకృష్ణ అన్నారు. నేను అడిగితే ‘ఏరా అరవై ఏళ్ల వయసులో రంగేసుకోమంటావ్..’(నెల్లూరు యాసలో) అన్నారు నాన్నగారు. నాక్కూడా నాన్న చేస్తే బావుంటుందని అనిపించింది. అందుకే అమ్మకి ఈ సినిమాను వివరించా. ‘తరతరాలు నిలిచిపోయే సినిమా అవుతుంది. అందులోనూ పాజిటివ్ పొలిటీషియన్ పాత్ర’ అని చెప్పా. అమ్మ నచ్చజెప్పాక నాన్న ఒప్పుకున్నారు. దానికి తోడు కోడిరామకృష్ణగారు కలిసి ‘మీరు రోజూ వేసుకునే బట్టలే వేసుకోండి. మీరు మాట్లాడే నెల్లూరు యాసే మాట్లాడండి. మీకు అనుకూలమైన సమయంలోనే షూటింగ్‌కు రండి. మీ ఇష్టప్రకారమే నేను చిత్రీకరిస్తా’ అని చెప్పి ఒప్పించారు. ‘ఒక్కరోజు షూటింగ్‌కి వస్తా. నచ్చితే ప్రొసీడ్ అవుదాం. లేకుంటే ఇంకొకరిని చూసుకోండి’ అని నిక్కచ్చిగా చెప్పారు నాన్నగారు. కానీ తొలిరోజు షూటింగ్‌లోనే ఆయనకు సినిమా బాగా నచ్చింది. ‘అంకుశం’ విడుదలైనప్పుడు ఆయన ఆటోగ్రాఫ్‌ల కోసం చాలా మంది వచ్చేవారు. మొదట్లో అందరినీ ఆశీర్వదిస్తూ మంచి పద్యాలు రాసి ఆటోగ్రాఫులు చేసేవారు. కానీ తాకిడి ఎక్కువ కావడంతో ఆ తర్వాత సంతకం మాత్రం చేసేవారు.’’
రామిరెడ్డికి స్పాట్ పెట్టాం!
‘‘మా ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’ సినిమాల షూటింగ్‌లను చాలా వరకు హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలోని రామిరెడ్డి ఇంట్లో చేశాం. మా ‘అంకుశం’ సమయానికి రామిరెడ్డి బి.ఎ. చదువుతుండేవాడు. జావా మోటర్ సైకిల్‌మీద కాలేజీకి వెళ్లొస్తూ మమ్మల్ని పలకరించేవాడు. చూడ్డానికి భారీ పర్సనాలిటీ, బాల్డ్ హెడ్‌తో టిపికల్‌గా కనిపించేవాడు. ‘అంకుశం’లో విలన్‌గా అతనైతే చక్కగా సరిపోతాడని కోడిరామకృష్ణగారు నాతో అన్నారు. నేను రాముని అడిగితే ‘ఐ డోంట్ వాంట్ టు యాక్ట్ శ్యామ్’ అన్నాడు. వాళ్లనాన్న జి.ఎస్.రెడ్డి, మా మామగారు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఊటీలో ఉండగా నేను ఫోన్ చేసి రామిరెడ్డిని ఆర్టిస్ట్ చేద్దామనుకుంటున్నానని చెప్పాను. ‘నీ సినిమాకు ఇబ్బంది లేకపోతే చేయించేయ్’ అన్నారు జి.ఎస్.రెడ్డి. వెంటనే రామూని ఒప్పించి చేయించాం. సినిమాలో అతని ఊతపదం ‘స్పాట్ పెడతా’ ఎంత పాపులరైందో తెలిసిందే. తన చుట్టూ ఉన్న రౌడీ మూక కూడా అతని కాలేజీ మేట్సే. రామూ తమ్ముడి పాత్రకు మాత్రం ప్రముఖ న్యాయవాది కోకా రాఘవరావుగారబ్బాయి బాబ్జీని తీసుకున్నాం. తనకీ, బాబూమోహన్‌కి కూడా మంచి పేరొచ్చింది. రాజశేఖర్, జీవిత జంట నేచురల్‌గా చేశారు. పాటలను ఇప్పటికి విన్నా ఫ్రెష్‌గా ఉంటాయి.’’
రియల్ ఇన్సిడెంట్
‘‘పోలీసులకు సంబంధించిన సినిమా తీస్తుండటంతో అప్పట్లో క్రైం మ్యాగజైన్లను ఎక్కువగా చదివేవాడిని. ఓ పోలీస్ ఆఫీసర్ ఛార్మినార్ ముందు రౌడీని బట్టలు విప్పి కొట్టుకుంటూ తీసుకొచ్చాడని ‘ఎన్ కౌంటర్’ పత్రికలో చదివా. ఆ పోలీస్ ఆఫీసర్‌ని అందరూ గబ్బర్‌సింగ్ అనేవారట. చదవగానే ఆ విషయం నన్ను ఆకట్టుకుంది. ఈ పర్టిక్యులర్ సీన్‌ను షూట్ చేద్దామని చార్మినార్ పోలీసుల్ని పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు. వెంటనే ఉదయాన్నే రెండు జీపుల్లో చార్మినార్‌కు చేరుకున్నాం. పండ్ల బండి లో ఓ కెమెరా, పువ్వుల మధ్య ఓ కెమెరా, ఆటోలో ఓ కెమెరా... ఇలా నాలుగు చోట్ల నాలుగు కెమెరాలను పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా సీన్ చేసేశాం. అక్కడి దుకాణాల వాళ్లు నిజంగానే పోలీసులు రౌడీలను కొడుతున్నారనుకుని షాప్‌లకు షట్టర్‌లు వేసి హంగామా చేశారు. అంతలో పోలీసులు అక్కడికి రానేవచ్చారు. అవన్నీ గమనించి మేం మెల్లిగా జారుకున్నాం. ఇదంతా ఒక ఎత్తు. బట్టలు విప్పించడానికి రామిరెడ్డిని బతిమాలడం ఒక ఎత్తు. ఎం తో నచ్చజెప్పి తనతో చేయించాం. ఆ సీన్‌నే 24 షీట్ పోస్టర్స్‌గా రిలీజ్ చేశాం.సినిమా సూపర్‌హిట్టయ్యింది’’

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home