Sunday, July 13, 2014

కథల వెనక కథలు


ఏకథ అయినా ఎక్కడ మొదలవుతుంది, ఒక కథకి ప్రేరణ ఏమిటి అన్న ప్రశ్న ఎలా వచ్చిందో ముందు చెప్తాను.నేను కిందటివారం రాసిన “నేనూ, నారచనలూ” టపామీద కొత్తపాళీగారు ఓ వ్యాఖ్య పెట్టేరు.
 “రచయిత రాసిందే పట్టించుకోవాలి మిగతా వివరాలన్నీ ఎందుకూ అంటారు కొంతమంది. కానీ నా మట్టుకి నాకు ఆయా కథల వెనుక రచయితకి ఉన్న ప్రేరణ ఏవిటి అనేది తెలుసుకోవడం చాలా బాగుంటుంది” అని.
దానిమీద నేను,  సమాధానం రాస్తూ, ప్రేరణమీద రాయడానికి చాలా వుంది అన్నాను, అనాలోచితంగానే.
అయితే రాయండి అని పూర్ణిమగారు అన్నారు. అప్పుడు నాకు తెలివొచ్చింది. J ఏంరాయాలా అని ఆలోచిస్తూ వాక్‌కి బయల్దేరి, దారి తప్పి పొరుగూరు వెళ్లిపోయాను. మాయింటినించి మైలున్నర నడిస్తే పొరుగూరే లెండి. దారి తప్పి తిరుగుతూంటే నాలుగుముక్కలు తోచేయి. ఇవి మీప్రశ్నకి సమాధానం అవునో కాదో మీరే చెప్పాలి.
నిజానికి రాస్తున్నవారందరూ ప్రేరణ కలగబట్టే కదా రాస్తున్నారు. అందుకు సందేహం లేదు. అయితే ఏకథ ఏప్రేరణతో వచ్చింది అంటే అప్పుడు బోలెడు కథలవెనక కథలు తెలుస్తాయి. ఈవిషయమే కొత్తపాళీ అన్నది, కథలకి ప్రేరణ ఏమిటో తెలుసుకోడం తనకి ఇష్టమని. దానికి నాకు తోచిన టీక ఏమిటంటే - చిన్నకథలకి ఒక ముఖ్యలక్షణం క్లుప్తత. అంటే, అటు ఆరుతరాలూ, ఇటు మూడు తరాలూ, లోకంలో గల సమస్త జనుల సమస్యలూ, మినిఎన్‌సైక్లోపిడియాలాగ రాసుకుంటూ పోడానికి నవలలో అయితే సాగుతుందేమో కానీ చిన్నకథలో అలా కాదు.. కథలో ప్రధానాంశంమీద మాత్రమే కేంద్రీకరించి కథ నడపాలి. తెలుగువాళ్లలో అలా రాయడానికి రావిశాస్త్రిగారికి పెట్టింది పేరు. ఆయన కథని శిల్పం చెక్కినట్టు ఒక్కొక్కమాట చెక్కుతారని ప్రసిద్ధి. అలా క్లుప్తంగా చెప్పినప్పుడు సహజంగానే చెప్పకుండా వుండిపోయినసంగతులు చాలా వుంటాయి.
ప్రతిభగల రచయిత కథలోనే మొత్తం చెప్పగలగాలి అంటారు గానీ దానికో లిమిటుంటుంది. చాలా మంచికథలో రచయిత తాను చెప్పదలుచుకున్న విషయం అంతా క్లుప్తంగా, స్పష్టంగా చెప్పి వుండొచ్చు. కానీ, ఆ కథ వెనక కథ ఏమిటో తెలుసుకున్నప్పుడు, ఆకథకి ప్రయెజనం ద్విగుణీకృతమవుతుంది. అంటే ఒకకథగా పరిపూర్ణంగా ఆవిష్కరించడం జరిగినా, దానికి వెనక వున్న ప్రేరణ ఏమిటో తెలిసినప్పుడు మరొకస్థాయి అర్థాన్ని సంతరించుకుంటుంది అని. (కొత్తపాళీగారూ, నా అర్థం తప్పయితే, చెప్పండి).
ఉదాహరణకి, నేను రాయని కథ ఒకటి, అంటే నిజంగా జరిగింది, చెప్తాను. ఒకసారి నేను మాఅమ్మాయిని చూడ్డానికి లాసాంజలస్ వెళ్లేను. తన గదిలో గోడమీద ఒక ఇంగ్లీషు కవిత వుంది. మామూలుగా మనం రోజూ అనుకునే మాటలే - రేపు ఏంఅవుతుందో తెలీదు, అంచేత ఈరోజు హరివిల్లు చూసి ఆనందించు .. అని. కింద తన స్నేహితురాలి పేరు చూసి, టాషా కవితలు రాస్తుందని నాకు తెలీదే అన్నాను.
అది టాషా కాదు, సారా రాసింది అంది మా అమ్మాయి. (నేను పేరు తప్పు చదివాను.).
నేను గతుక్కుమన్నాను. ఎందుకంటే -
టాషా చిన్న చెల్లెలు సారా. చిన్నమ్మాయి. తొమ్మిదేళ్లు.
అంతచిన్నమ్మాయికి అంత ఫిలాసఫీ ఏమిటి అని.
ఆకవిత రాసిన రెండునెలలకి
ఆఅమ్మాయి మరో ఇద్దరు స్నేహితులతో, సైకిళ్లమీద రోడ్డు దాటుతోంది.
అటునించి వస్తున్న కారు చూసుకోలేదు.
ప్రమాదం జరిగింది.
మిగతా ఇద్దరికి చిన్న దెబ్బలే కానీ సారాకి ప్రాణాంతకమైంది.
మరో రెండు వారాలకి ఆచిన్ని ప్రాణం పోయింది.
అవును, మీలాగే, నాకు చాలా బాధగా అనిపించింది. అంతేకాదు, ఇతర ఆలోచనలు - అంతచిన్నమ్మాయికి అంత గంభీరమైనవిషయం ఎందుకు రాయాలనిపించింది,, తాను అట్టే కాలం బతకనని తనకి తెలుసా, కాకతాళీయమా, …
ఇక్కడ నేను ఉదాహరణగా ఇవ్వడానికి కారణం, వాక్యం తరవాత వాక్యం చదువుతుంటే, మీఆలోచనలు మారుతూ వచ్చేయి కదా. అలా మీఆలోచనలు మారుతూ సాగడానికి అనువుగా వాక్యాలు విరిచేను కూడా అనుకోండి. 
కథల్లో కూడా అంతే జరుగుతుంది. మీకు ఒకొక్కవిషయం తెలుస్తుంటే, కథ పువ్వు విడినట్టు వెల్లివిరుస్తుంది. కథ అంతకంతా అర్థవంతమవుతుంది.
నారచనలువ్యాసంలో చాలా చోట్ల నేను ఒక చిన్నవాక్యం ఇచ్చి, ఇదే ఈకథకి ప్రేరణ అని చెప్పేను. అంటే ఆ ఒక్కవాక్యంతో కథ తయారయిపోయిందని కాదు. అది ప్రేరణలో తొలిమెట్టు మాత్రమే. అంతకుముందూ, ఆతరవాతా జరిగిన చాలా సంఘటనలు -విన్నవీ, కన్నవీ, చదివినవీ- చాలా విషయాలు బుర్రలో పురుగుల్లా తొలుస్తూనే వుంటాయి నాకు ఎప్పుడూను.. అందులో కధకి పనికొచ్చేవి ఏరుకుని, కూర్చుకుని కథని ఓకొలిక్కి తెస్తాను. 
ఈవ్యాసంలో, ఏదో ఒకకథ మొదలు పెట్టినతరవాత ఆతొలి ప్రేరణని ఎలా మలుచుకున్నానో చెప్తాను. మీరూ మీకథలని ఎలా మలుచుకుంటున్నారో రాస్తే మంచి చర్చ అయి, మరిన్ని పనికొచ్చే విషయాలు తెలుస్తాయి. 
ఒకొక్కప్పుడు ఏదో ఒకవాక్యం ఠకీమని తగులుతుంది అన్నాను. నవ్వరాదు కథకి మూలం కూడా ఒక్కవాక్యమే. అది 1968లో రాశాను. కాని దానికి మూలకారణమైన వాక్యం విన్నది 1957 ప్రాంతాల్లో. ఆ ఒక్క వాక్యంమీద కథ రాయడానికి అంతకాలం పట్టింది నాకు.
ఆవాక్యం - మావాళ్లలోనే, ఒకాయన. ఆయనకి సంగీతం చాలా ఇష్టం. నలుగురు ఆడపిల్లలకీ వీణ చెప్పించేరు. పెద్దమ్మాయిని మేనత్త తనంత తనే కోరి కోడలుగా చేసుకుంది. మేనరికం అంటే ఈపిల్ల ఏం నేర్చుకుందో తెలిసే వుండాలి కద. పెళ్లి అయింతరవాత, ఆఅమ్మాయి వీణ తీస్తే, సంగీతం ఏమిటి సానికొంపలాఅందిట అత్తగారు. ఆమాట మాఅమ్మ ఎవరితోనో చెప్తుంటే విన్నాను. ఆతరవాత కొంతకాలానికే. చిన్నతనంలోనే ఒక రకమైన మస్క్యలర్ డిస్ట్రెఫీతో చనిపోయింది. నేను షాకు తిన్నాననే అనుకుంటాను. అందుకే నాకు దాన్నిగురించి రాయడానికి అన్నేళ్లు పట్టింది.

అయితే, వాళ్లింట్లో సంగతులు నాకు పూర్తిగా తెలీవు. నిజంగా ఏంజరిగిందో, వున్నదున్నట్టు రాయడానికి లేదు. నాకు అర్థం అయిందల్లా తనవాళ్లే అంత కఠినమైన మాట అన్నారు అన్నదే. అచ్చంగా ఆకథే రాయాలని మొదలుపెట్టలేదు నేను నాకథ.
నాకు చిన్నప్పుటినుండీ నవ్వుతాననీ, నవ్విస్తాననీ పేరుంది. అంచేత, నవ్వడంమీద సరదాగా రాద్దాం అనే మొదలుపెట్టేను. అందుకే ఆమధ్యకాలంలో, 1957-68, అప్పుడప్పుడు వింటున్నమాటలు, చూస్తున్నవిషయాలు పెళ్లి కాని ఆడపిల్లలు అన్నగార్ల ఇంట్లో కాలక్షేపం చెయ్యడం, కాలేజీలో హాస్యాలూ, సినిమాకబుర్లూ … ఇవన్నీ ఆకథలో చోటు చేసుకున్నాయి. హాస్యంగా మాటాడినా, మరోవేపు జనాలని తప్పుకుతిరగడం కూడా నాలక్షణమే. నేనంటే ప్రత్యేకంగా అభిమానం చూపించే స్నేహితురాళ్లు కూడా వున్నారు ఆ పదేళ్లకాలంలోనూ. అలా అనేక విషయాలు, వేరు వేరు స్థలాల్లో వేరు వేరు కాలాల్లో జరిగినవి అనేకం కలిసి ఓకథగా రూపు సంతరించుకున్నాయి. అయితే అందులో సౌందర్యం ఏమిటంటే వాటినన్నటిని ఒకగూట్లోకి చేర్చడం. అది సమర్థవంతంగా చేసానా లేదా అన్నది మీరే చెప్పాలి.

ఇంతటి విషాదకరమైన విషయమే అక్కర్లేదు కథ రాయడానికి. జీర్ణతృణంకథ రాయడానికి ఆధారం అక్షరాలా గరికపోచలే. నేను 1961-62లో లైబ్రరిసైన్సులో చేరేను. అదే సంవత్సరం కొత్తలైబ్రరీ భవనానికి ప్రారంభోత్సవం అయింది. ఇప్పుడున్న లైబ్రరీ అదే. అప్పుడు లైబ్రేరియన్, కోనేరు రామకృష్ణరావుగారు లైబ్రరీచుట్టూ తోట వేస్తే బాగుంటుందనీ, అందర్నీ మొక్కలు తీసుకురమ్మనీ ప్రోత్సహించారు. నేను నిజంగానే అవేవో గడ్డిపరకలు తీసుకువెళ్లేను. ఎక్కడినుంచో నాకిప్పుడు జ్ఞాపకంలేదు కానీ గడ్డి ఇచ్చిన మాట నిజం. ఆతరవాత కొంతకాలం తరవాత చూస్తే, నిజంగానే ఆ గరికపోచలు పచ్చని తివాసీలా కన్నులపండుగ చేసేయి. ఇది అమెరికాలోలాగ కత్తిరింపులసొగసు కాదు. నిలువుగా పెరిగి, సహజమైన కొనలతో వుండే అందం.
అయితే పచ్చగడ్డిమీద కథ ఏం రాయగలం, పల్లెపదాలు రాయొచ్చునేమో కానీ. అంచేత మళ్లీ నా ఖజానాలోంచి కథ లాగాల్సివచ్చింది పత్తిలోంచి దారం లాగినట్టు. చెప్పేను కదా మానాన్నగారు స్కూలుటీచరు కనక, స్కూళ్లలో జరిగే ట్రాన్సఫరులూ, పెన్షనుకోసం పడే అగచాట్లూ నాకు అవగతమే. అంచేత, నా గరికపోచలకి ఓ టీచరమ్మని కథానాయకిని చేసేను. వూరిబయట బంగళా, తుపాకీతో దొరగారూ కొంత రావిశాస్త్రిగారి కథలు చదవగా పట్టుబడ్డ (లేదా పట్టుకోవాలని తాపత్రయపడుతున్న) నుడికారం. రావిశాస్త్రిగారి పువ్వులు కథలో ఈతుపాకీ పేలదు అని ఓవాక్యం వుంది. అది చాలా గొప్పవాక్యం ఆకథలో. పోతే, విశాఖ హార్బరులో అప్పుడప్పుడు కనిపించే తెల్లదొరలూ.

అంటే నేననడం ప్రేరణ అంటే మీట నొక్కినట్టు ఏదో ఒక మాటా, ఒక సంఘటనా, ఒక వస్తువూ .. వూపునివ్వడం మాత్రమే కాదు. కథ మలచడం మొదలు పెట్టిన్నప్పుడు ఇతర సామగ్రి చాలా వాడుకోడం జరుగుతుంది.. ప్రేరణనిచ్చేది ఒకటి కావచ్చు, కథ మరొకటి కావచ్చు.

ప్రతికథకీ ఓమనిషో ఓసంఘటనో మాత్రమే కావాలని ఏం లేదు. ఫలరసాదుల గురియవే పాదపములూ”, “వానరహస్తంలాటి కథలు ముందు శీర్షిక పెట్టేసుకుని, తరవాత కథలు ఆలోచించేను. వానరహస్తంఅన్న శీర్షిక ఎందుకు పెట్టేనని ఎవరైనా అడుగుతారేమోనని చూస్తున్నా కానీ ఇంతవరకూ ఒక్కరూ అడగలేదు. ఇంక సస్పెన్సు భరించలేక నేనే చెప్పేస్తున్నాను.
నేను ఆంధ్రాయూనివర్సిటిలో ఆనర్సు చదివేరోజుల్లో వానరహస్తం అన్న శీర్షకతో ఒక నాటిక చూసాను భారతి మాసపత్రికలో. దానికి మూలం w.w. Jacobs రాసిన Monkey’s paw అన్న ఓ చిన్నకథ. నాకు నాటకాలంటే సరదాలేదు కానీ ఆశీర్షికా, దానివెనక కాంసెప్టూ చాలా నచ్చేయి.  శీర్షికే ప్రేరణ అయినా, నాకథకీ దానికీ మరే సంబంధమూ లేదు. మళ్లీ సంఘటనలకోసం నాభోషాణం వెతక్కోవాల్సొచ్చింది. అంతకుముందు, అంటే ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో మా అప్పాయమ్మ కొడుకు పదేళ్ల కుర్రాడు నాకు కాలేజీకీ కాఫీ తెచ్చేవాడు. రెండునెలలు అయింతరవాత అప్పాయమ్మ చెప్పింది వాడు ఆపని చెయ్యనంటున్నాడని. తోటి పిల్లలు హేళన చేస్తున్నారట కాఫీలు మోస్తున్నాడని. అది తలుచుకున్నప్పుడు నాకు తోచింది అతని వ్యక్తిత్వం. నాకథలో ముత్తయ్యని అలా దిద్దేను. అలాగే నేను లైబ్రరీలో పని చేసేరోజుల్లో ఒకమ్మాయి వుండేది యల్.డి. క్లర్కు. ఇంటినిండా పదిమంది పెద్దా, చిన్నా. తన ఆదాయం ఒక్కటే అందరికీ ఆధారం. అలాటి కొందరు క్లర్కులని చూసిన తరవాత తయారయిన పాత్ర సావిత్రి.
ఆఅమ్మాయికి కన్నీరు పిలిచిన పలుకు తల్లి. ఆవిషయం నేను హాస్యానికైనా వాడుకోవచ్చు, విషాదం సృష్టించడానికేనా  వాడుకోవచ్చు. ఆకళ్లు, … వాటినిండా నీళ్లులాటి వాక్యాలు వాడుకోవాలంటే, కథకుడి బలహీనత చూపాలి. అలాగే ముత్తయ్య తల్లి కల్లూ ఒల్లూ తిప్పుకుంటూ ఊసులాడతాదని ఆయమ్మనొగ్గేసి నాకొడుకు పొట్ట కొట్టీసినాడులాటి వాక్యాలు రాయడానికి కూడా కథకుడిని సావిత్రికి ఆపోజిట్‌గా నిలబెట్టాను. అంచేతే, కథకుడిని అబ్బాయిని చేసేను.

నిజానికి రాయడం ఫుల్‌టైం ఉజ్జేగమే. మీరు రోజుకో కథ రాయక్కర్లేదు. కానీ దానిగురించిన తపన వుండాలి సదా. కనిపించిన ప్రతివస్తువూ, ప్రతి సంఘటనా, ప్రతి మనిషీ కథగా వెంటనే మారిపోరు. పదిలంగా దాచుకుంటే ఎప్పుడేనా పనికొస్తాయి. ప్రేరణ విషయంలో నాకు తెలిసింది ఇంతే.

ఇదీ ‘కొత్త బంగారులోకం’ నేపథ్యం..
 2003 సంవత్సరానికి ముందు నుంచి సినీ పరిశ్రమలోకి వెళ్లాలన్న కోరిక మరీ బలపడింది. దర్శకుడిగా టీనేజ్ కథా వస్తువుతో ఓ చిత్రానికి కథ రాసి, దర్శకత్వం వహించాలన్న లక్ష్యం పెట్టుకున్నా. పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను ప్రేమతో, భయంతో పెంచు తున్న తల్లిదండ్రుల భావాలు.. ఆకర్షణలో చేసే పనిని ఆలోచించి చేయాలని, తప్పు చేస్తే తనతో చె ప్పి చేయాలనే అంశాలు ఆధారంగా పిల్లలను అర్థం చేసుకునే నాన్న పాత్ర ద్వారా ‘కొత్త బంగారులోకం’ తీశా. తొలి చిత్రంతోనే హిట్ కొట్టా.

 ‘సీతమ్మ’ కథకు తిరుపతిలో శ్రీకారం
 తొలి చిత్రం విజయంతో రెండో చిత్రంవైపు ఉత్సాహంగా అడుగులు వేశా. ఈసారి కుటుంబ బంధాలకు సంబంధించి ఓ వినూత్న కథ రాయాలనుకున్నాను. తిరుపతి వెంకన్న అంటే అమితమైన ఇష్టం. ఆయన సన్నిధికి వెళితే రెండు రోజులు కొండపైనే ఉండి, ప్రశాంతంగా గడుపుతాను. అక్కడకు వస్తున్న కోట్లాదిమంది భక్తుల్లో ఒక్కొక్కరికి ఒక్కో మనస్తత్వం ఉంటుంది. కానీ ఆ సన్నిధిలో అందరూ చేతులెత్తి స్వామిని చూసి తన్మయత్వం చెందుతున్న దృశ్యాలను చూశాను. మనిషిలో మంచితనం ఉంటుంది.

 దీనినుంచే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కథకు ప్రేరణ దొరికింది. ‘మనిషి అంటే మంచోడు’ అనే మాటతో కథ అల్లాను. ఇద్దరు అన్నదమ్ముల పాత్రలు సృష్టించి ఇద్దరికీ చెరో మనస్తత్వ కోణాలు చూపించి కథ రాశాను. ఈ కథ మల్టీస్టార్‌‌సతో అయితే బాగుంటుందన్న ఆలోచనను నిర్మాత దిల్‌రాజు ముందు ఉంచాను. ఆయన సై అన్నారు. అడిగిందే తడవుగా హీరో వెంకటేష్ తొలుత రెడీ చెప్పారు. తర్వాత మహేష్‌బాబు కథ విని ఓకే అన్నారు. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్.

అందుకే రొటీన్‌కు భిన్నంగా వెళ్లా

సందీప్‌కిషన్‌, రెజీనా హీరోహీరోయిన్లుగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రారా కృష్ణయ్య’. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర దర్శకుడు పి.మహేశ్‌బాబు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పత్రికలవారితో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... ‘‘మేం ఊహించినట్టుగానే ‘రారా కృష్ణయ్య’ చిత్రానికి అన్ని చోట్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాలో కొత్తదనం కోసం దక్షిణ భారతదేశం సంస్కృతులన్నీ చూపించాలనుకున్నాం. అందుకే చెన్నై, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, బెంగళూరు... ఇలా అన్ని ప్రాంతాలలోని కల్చర్‌ను కవర్‌ చేశాం. సినిమాలోనే కాదు క్యారెక్టరైజేషన్‌లో కూడా ఫ్రెష్‌నెస్‌ తీసుకురావడానికి అలాంటి బ్యాక్‌డ్రాప్‌ ఎంచుకోవడం జరిగింది. రొటీన్‌కు భిన్నంగా వెళ్లడానికి ప్రయత్నం చేశాను. ‘మొగుడు’ సినిమాకు కృష్ణవంశీ దగ్గర నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. ఆ తరువాత ‘బావ’, ‘సోలో’ చిత్రాలకూ పనిచేశాను. ‘వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌’ సినిమా మొదలైన కొత్తలోనే ప్రొడ్యూసర్‌ ద్వారా సందీప్‌కు ఈ కథ చెప్పాను. ఆయన ఓకే అన్నాడు. ఆ సినిమా స్ఫూర్తితో... కొందరు అనుకుంటున్నట్టు ఇది ఏ చిత్రానికీ కాపీ కాదు. మేం తీసుకున్న పాయింట్‌తో కొన్ని సినిమాలు వచ్చిన మాట వాస్తవమే. కానీ హాలీవుడ్‌ దర్శకుడు డానీ బోయెల్‌ కెరీర్‌ కొత్తలో ఇలాంటి కాన్సెప్టుతోనే ‘లైఫ్‌ లెస్‌ ఆర్డినరీ’ అనే సినిమా తీశాడు. మనం ఏదైతే చేయకూడదని గట్టిగా అనుకుంటామో తరువాత కాలంలో అదే తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఆ స్ఫూర్తితో చేసిందే ‘రారా కృష్ణయ్య’. నేను అనుకున్న సినిమా తీయగలిగాను. ఫొటోగ్రఫీ బాగా కుదిరింది సినిమాలో అన్నదమ్ముల అనుబంధం బాగా పండుతోంది. సెకండాఫ్‌కు పెద్ద ఎస్సెట్‌ అయ్యింది. ఈ సంస్థలో వచ్చిన ‘సోలో’, ‘నువ్వా?నేనా?’ సినిమాల్లాగే ఈ సినిమా కూడా ఫ్యామిలీ అంతా చూసేలా ఉండాలని ప్రొడ్యూసర్‌ ముందుగానే చెప్పారు. సినిమా అంతా అలాగే ఉంటుంది. సినిమాకు ఫొటోగ్రఫీ బాగా కుదిరిందని అంటున్నారు. కెమెరామేన్‌కు, నాకు బాగా సింక్‌ అయ్యింది. ఇద్దరం కలిసి నెల రోజుల పాటు కేరళ, తమిళనాడు మొత్తం తిరిగాం, అక్కడి కల్చర్‌ తెలుసుకోవడానికి. అద్భుతమైన ఫీలింగ్‌ జగపతిబాబు గారిని డైరెక్ట్‌ చేయడం అద్భుతమైన ఫీలింగ్‌. సందీప్‌, నేను, రెజీనా ఫ్రెండ్స్‌లా పనిచేసుకుంటూపోయాం. కానీ, జగపతిబాబు గారు వచ్చిన తరువాతే నేను డైరెక్ట్‌ చేస్తున్నాననే ఫీలింగ్‌ వచ్చింది. ఆయన దర్శకుడిగా నాకెంతో గౌరవం ఇచ్చారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు చేస్తే దర్శకులకు పేరు రాదు. నటీనటులకు వస్తుంది. అదే మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చేస్తే దర్శకులకు పేరు వస్తుంది. ‘రారా కృష్ణయ్య’ సినిమాతో నామీద నాకు ఓ నమ్మకం ఏర్పడింది’’

పోలీస్‌ పవరుకు రజతోత్సవం!

అన్యాయాన్ని తుదముట్టించగలిగిన వాడే పోలీస్‌ ఆఫీసర్‌. కరడుగట్టిన రౌడీయిజాన్ని మట్టికరిపించడమే అతని ముందున్న కర్తవ్యం. ఈ అంశంతో ‘అంకుశం’ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించారు శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి. రాజశేఖర్‌కు యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌గా గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రమిది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే రామిరెడ్డి విలన్‌గా తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రాన్ని ‘ఇదుదాండా పోలీస్‌’ పేరుతో రాజశేఖర్‌ తమిళంలోకి అనువదించి మంచి పేరును తెచ్చుకున్నారు. చిరంజీవి హిందీలో అడుగుమోపిందీ ఈ సినిమా కథతోనే. కన్నడ, బెంగాలీలోనూ రూపొందిన ఈ సినిమా ఆదివారానికి పాతిక వసంతాలను పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ‘చిత్రజ్యోతి’తో ఆనాటి అంశాలను ముచ్చటించారు. పవర్‌ఫుల్‌ జ్ఞాపకాలను పదిలంగా చెప్పుకొచ్చారు. ఆ వివరాలు...
‘‘నేను, కోడి రామకృష్ణ, రాజశేఖర్‌.. అందరూ కుర్రవాళ్లం. ఉడుకు రక్తంతో ఉండేవాళ్లం. ఓ వైపు టి.కృష్ణ సినిమాలు.. మరో వైపు సామాజిక బాధ్యతలను గుర్తుచేసే సినిమాలు... ఆ తరుణంలో మేం తెరకెక్కించిన సినిమానే ‘అంకుశం’. కథ గురించి అనుకోగానే చాలా బాగా నచ్చింది. అందులోని సీఎం పాత్ర ఎవరు వేస్తే బావుంటుందా? అని చాలా ఆలోచించాం. ‘నాన్నగారిని(ఎమ్మెస్‌ రెడ్డి) ఒప్పించండి’ అని కోడిరామకృష్ణ అన్నారు. నేను అడిగితే ‘ఏరా అరవై ఏళ్ల వయసులో రంగేసుకోమంటావ్‌..’(నెల్లూరు యాసలో) అన్నారు నాన్నగారు. నాక్కూడా నాన్న చేస్తే బావుంటుందని అనిపించింది. అందుకే అమ్మకి ఈ సినిమాను వివరించా. ‘తరతరాలు నిలిచిపోయే సినిమా అవుతుంది. అందులోనూ పాజిటివ్‌ పొలిటీషియన్‌ పాత్ర’ అని చెప్పా. అమ్మ నచ్చజెప్పాక నాన్న ఒప్పుకున్నారు. దానికి తోడు కోడిరామకృష్ణగారు కలిసి ‘మీరు రోజూ వేసుకునే బట్టలే వేసుకోండి. మీరు మాట్లాడే నెల్లూరు యాసే మాట్లాడండి. మీకు అనుకూలమైన సమయంలోనే షూటింగ్‌కు రండి. మీ ఇష్టప్రకారమే నేను చిత్రీకరిస్తా’ అని చెప్పి ఒప్పించారు. ‘ఒక్కరోజు షూటింగ్‌కి వస్తా. నచ్చితే ప్రొసీడ్‌ అవుదాం. లేకుంటే ఇంకొకరిని చూసుకోండి’ అని నిక్కచ్చిగా చెప్పారు నాన్నగారు. కానీ తొలిరోజు షూటింగ్‌లోనే ఆయనకు సినిమా బాగా నచ్చింది. ‘అంకుశం’ విడుదలైనప్పుడు ఆయన ఆటోగ్రాఫ్‌ల కోసం చాలా మంది వచ్చేవారు. మొదట్లో అందరినీ ఆశీర్వదిస్తూ మంచి పద్యాలు రాసి ఆటోగ్రాఫులు చేసేవారు. కానీ తాకిడి ఎక్కువ కావడంతో ఆ తర్వాత సంతకం మాత్రం చేసేవారు.’’
రామిరెడ్డికి స్పాట్‌ పెట్టాం!
‘‘మా ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’ సినిమాల షూటింగ్‌లను  చాలా వరకు హైదరాబాద్‌, శ్రీనగర్‌ కాలనీలోని రామిరెడ్డి ఇంట్లో చేశాం. మా ‘అంకుశం’ సమయానికి రామిరెడ్డి బి.ఎ. చదువుతుండేవాడు. జావా మోటర్‌ సైకిల్‌మీద కాలేజీకి వెళ్లొస్తూ మమ్మల్ని పలకరించేవాడు. చూడ్డానికి భారీ పర్సనాలిటీ, బాల్డ్‌ హెడ్‌తో టిపికల్‌గా కనిపించేవాడు. ‘అంకుశం’లో విలన్‌గా అతనైతే చక్కగా సరిపోతాడని కోడిరామకృష్ణగారు నాతో అన్నారు. నేను రాముని అడిగితే ‘ఐ డోంట్‌ వాంట్‌ టు యాక్ట్‌ శ్యామ్‌’ అన్నాడు. వాళ్లనాన్న జి.ఎస్‌.రెడ్డి, మా మామగారు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఊటీలో ఉండగా నేను ఫోన్‌ చేసి రామిరెడ్డిని ఆర్టిస్ట్‌ చేద్దామనుకుంటున్నానని చెప్పాను. ‘నీ సినిమాకు ఇబ్బంది లేకపోతే చేయించేయ్‌’ అన్నారు జి.ఎస్‌.రెడ్డి. వెంటనే రామూని ఒప్పించి చేయించాం. సినిమాలో అతని ఊతపదం ‘స్పాట్‌ పెడతా’ ఎంత పాపులరైందో తెలిసిందే. తన చుట్టూ ఉన్న రౌడీ మూక కూడా అతని కాలేజీ మేట్సే. రామూ తమ్ముడి పాత్రకు మాత్రం ప్రముఖ న్యాయవాది కోకా రాఘవరావుగారబ్బాయి బాబ్జీని తీసుకున్నాం. తనకీ, బాబూమోహన్‌కి కూడా మంచి పేరొచ్చింది. రాజశేఖర్‌, జీవిత జంట  నేచురల్‌గా చేశారు. పాటలను ఇప్పటికి విన్నా ఫ్రెష్‌గా ఉంటాయి.’’
రియల్‌ ఇన్సిడెంట్‌
‘‘పోలీసులకు సంబంధించిన సినిమా తీస్తుండటంతో అప్పట్లో క్రైం మ్యాగజైన్లను ఎక్కువగా చదివేవాడిని. ఓ పోలీస్‌ ఆఫీసర్‌ ఛార్మినార్‌ ముందు రౌడీని బట్టలు విప్పి కొట్టుకుంటూ తీసుకొచ్చాడని ‘ఎన్‌ కౌంటర్‌’ పత్రికలో చదివా. ఆ పోలీస్‌ ఆఫీసర్‌ని అందరూ గబ్బర్‌సింగ్‌ అనేవారట. చదవగానే ఆ విషయం నన్ను ఆకట్టుకుంది. ఈ పర్టిక్యులర్‌ సీన్‌ను షూట్‌ చేద్దామని చార్మినార్‌ పోలీసుల్ని పర్మిషన్‌ అడిగితే ఇవ్వలేదు. వెంటనే ఉదయాన్నే రెండు జీపుల్లో చార్మినార్‌కు చేరుకున్నాం. పండ్ల బండి లో ఓ కెమెరా, పువ్వుల మధ్య ఓ కెమెరా, ఆటోలో ఓ కెమెరా... ఇలా నాలుగు చోట్ల నాలుగు కెమెరాలను పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా సీన్‌ చేసేశాం. అక్కడి దుకాణాల వాళ్లు నిజంగానే పోలీసులు రౌడీలను కొడుతున్నారనుకుని షాప్‌లకు షట్టర్‌లు వేసి హంగామా చేశారు. అంతలో పోలీసులు అక్కడికి రానేవచ్చారు. అవన్నీ గమనించి మేం మెల్లిగా జారుకున్నాం. ఇదంతా ఒక ఎత్తు. బట్టలు విప్పించడానికి రామిరెడ్డిని బతిమాలడం ఒక ఎత్తు. ఎం తో నచ్చజెప్పి తనతో చేయించాం. ఆ సీన్‌నే 24 షీట్‌ పోస్టర్స్‌గా రిలీజ్‌ చేశాం.సినిమా సూపర్‌హిట్టయ్యింది’’

Saturday, July 12, 2014

సినిమా కథనం

సాధారణంగా మన సినిమాల్లో కథలన్నీ ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటాయి. అలాగే కథనం కూడా సరళ రీతిలో ఉంటుంది. ఒక వ్యక్తి తన గమ్యం చేరడానికి లేదా లక్ష్యం నెరవేర్చడానికి పడే ప్రయత్నం, ఆ ప్రయత్నం లో అతనికెదురయ్యే ఆటంకాలు, అవాంతరాలను అధిగమించి చివరకా వ్యక్తి విజయం సాధించడంతో కథ ముగుస్తుంది. కథలో జరిగే సంఘటనలను సరళ రీతిలో చెప్పకుండ, కథలోని కొన్ని భాగాలను flashbackల రూపంలో చెప్పడం కొన్ని కథల్లో జరుగుతుంది.ఈ మధ్యకాలంలో వచ్చిన faction సినిమాలు చాల వరకూ ఈ flashback అనే ప్రక్రియను బాగా వాడుకున్నాయి. కానీ ఇదే రకమైన కథా వృత్తాంతాన్ని మళ్ళీ మళ్ళీ వాడడంతో ఇప్పుడొచ్చే ప్రతి action సినిమాలోనూ హీరో పూర్వకథను గురించి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. దాంతో ప్రతి సినిమా హీరో పూర్వకథా ప్రకాశన మీదే ఆధారపడిపోతుంది. ఇలా flashback ఆధారంగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, ఇంద్రసేనా రెడ్డి, సింహాద్రి లంటి సినిమాలు భారీ విజయం సాధించడంతో, దర్శకులు ప్రతి సినిమాలోను హీరోకు పదునైన పూర్వ కథను సృష్టించాలన్న ప్రయతనంలో ప్రేకషకులను మెప్పించలేక చివరికి సినిమాలు box-office దగ్గర చతికలు బడ్డాక కానీ అసలు విషయం తెలుసుకోలేకపోతున్నారు.నిజానికి ప్రేక్షకులు అక్కడ ఆదరించింది flashback అనే ప్రక్రియను కాదనీ, కథనంలోనూ మరియు కథలోని సంఘటనలను ప్రేక్షకులకు తెలియచేయటంలో ఎన్నుకున్న వరుస క్రమంలోని కొత్తదనాన్ని మాత్రమే ఆదరించారని తెలుసుకొనుంటే మన సినిమాల్లో కొద్దో గొప్పో మార్పు జరిగుండేది. ఉదాహరణకు “ఒక్కడు” సినిమా తీసుకుంటే ఇందులో పెద్దగా flashbackలు ఏమీ ఉండవు.కేవలం భూమిక క్యారెక్టర్ పూర్వ కథను ప్రేక్షకులకు తెలియచేయడనికి మాత్రమే flashback ప్రక్రియను ఉపయోగించారు తప్పితే ఈ ప్రక్రియ ద్వార ప్రేక్షకులలో భావోద్వేగాలలో మార్పేమీ వుండదు. అయినా కూడా ఈ సినిమా భారి విజయాన్నే సాదించింది. అలాగే “మురారి”, “అతడు” లాంటి సినిమాలు కూడా.కానీ “అతడు” సినిమాలోనూ, మరియు “అతనొక్కడే” సినిమాలోనూ ఈ flashback ప్రక్రియను ఎంతో వైవిధ్యంగా ఉపయోగించారు దర్శకులు. “అతనొక్కడే” సినిమాలో అయితే flashback ప్రక్రియనే కాకుండా flash forward అనే మరో ప్రక్రియను మొదటిసారిగా తెలుగు సినిమా తెరపై ఉపయోగించారు దర్శకుడు సురేందర్. భవిష్యత్తులో జరగబోయే సంఘటనా దృశ్యాల్ని తెరపై తళుక్కి మనిపించి ప్రేక్షకులలో మదిలో ఆపేక్ష, ఆసక్తి కలుగచేయడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. ఇదే విధంగా “అతడు” సినిమాలో ఒకే సంఘటనను వేర్వేరు కోణాల్లో దృశ్యీకరించడం ద్వారా ఒకే విషయానికి వేర్వేరు దృక్పధాలను కలిగించే ప్రయత్నం చేసారు దర్శకుడు త్రివిక్రం. కానీ ఇలా ఒకటో రెండో సినిమాలు తప్పితే మిగిలిన మన సినిమాలన్నీ మూసధోరణిలో సాగిపోతున్నాయి.మారుతున్న సమాజం, ప్రపంచ సినిమాలో వెల్లడవుతున్న నవకల్పనలు, సాహిత్యం, సంగీతాలతో పాటు మిగిలిన కళలలో ఏర్పడుతున్న మార్పులు మన సినిమాల్లో చోటు చేసుకోకపోవడమే కాకుండా అలాంటి మార్పు తేవాలన్న ఉద్దేశం కూడా లేకపోవడమే ఈ మూసధోరణికి కారణమని చెప్పొచ్చు.
అయితే హిందీ మరియు తమిళ సినీ పరిశ్రమలో ఈ మార్పు జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య హిందీలో వచ్చిన Life in a Metro, Honey Moon Travels Pvt Ltd, Salaam-E-Ishq సినిమాలు చూసిన వాళ్ళకీవిషయం అర్థమైవుండాలి.అలాగే తమిళంలో వచ్చిన 12B, వీరుమాండి, యువ సినిమాలు మార్పు మొదలయిందనడానికి ఉదాహరణలు. కథాపరంగా ఈ సినిమాలు వేటికవే అయినప్పటికీ ఈ సినిమాలన్నింటిలోను కథా గమనం మరియు వృతాంతం మాత్రం ఒకదానితో ఒకటి పోలివుంటాయి. ఈ సినిమాలు చూడడనికి కానీ, చెప్పుకోడనికి గానీ ఏ విధంగానూ గొప్ప సినిమాలు కాకపోయినప్పటికీ ప్రపంచంలోని అన్ని దేశాల సినిమాలలో సంభవిస్తున్న మార్పులానే మన దేశంలో కూడా సినిమాలు మారుతున్నాయన్న నిజాన్ని ఈ సినిమాలు నిర్ధారిస్తున్నయని మాత్రం చెప్పక తప్పదు. ఆరునెలల నిడివిలో మూడు హిందీ సినిమాలు ఇటువంటి విభిన్న ఇతివృత్తంతో రూపొందించబడ్డాయంటే త్వరలో ఇటువంటి సినిమాలు మనల్ని ముంచెత్తుతాయనడంలో అతిశయోక్తి లేదు.అయితే ఈ మూడు సినిమాల్లోని ప్రత్యేకతేంటి అనేది ప్రశ్న!
పైన పేర్కొన్న మూడూ సినిమాలకు, మిగిలిన సినిమాలకు తేడా ముఖ్యంగా ఈ క్రింద పేర్కొన్న రెండు అంశాలే!
1)సినిమా కథను సంఘటనలు జరిగిన సమయానుక్రమంలో సరళ రీతిళో కాకుండా, విరళ రీతిలో చెప్పడం.
2)మిగిలిన సినిమాల్లో లాగా ఒకరు లేదా ఇద్దరు ముఖ్య పాత్రధారుల జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా కథను ముందుకు నడిపించకుండా, సినిమాలోని ప్రతి పాత్రధారునికీ సరైన ప్రాముఖ్యత కల్పిస్తూ, ఆ పాత్రల మధ్య అకస్మాత్తుగా లేదా యాధృచ్చికంగా జరిగే సంఘటనల ఆధారంగా కథ నడిపించడం.
మనకిలాంటి సినిమాలు కొత్తే అయినప్పటికీ చాలా రోజుల ముందు నుంచే ప్రపంచంలోని ఎన్నో దేశాల్లోని దర్శకులు ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉన్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు: Kieslowski’s Blind Chance, Akira Kurasawa’s Roshoman, Quentin Tarantino’s Pulp Fiction. ఈ సినిమాలే కాకుండా Run Lola Run, Midaq Alley, Tic Tac, 11:14, Hieghts, Crash, Yi ge zi tou de dan sheng, Hawai-Oslo, Traffic, Syriana, 21 Grams, Babel లాంటి ఎన్నో సినిమాలు ఈ కోవకే చెందుతాయి.
ఇలాంటి సినిమాలనే ఇంగ్లీషులో Non Linear Narrative కలిగిన సినిమాలుగా పిలవడం జరుగుతుంది. ఈ తరహా సినిమాల్లోనూ రెండు రకాలున్నాయి.
1)కథ పరంగా మామూలు సినిమాల్లాగే ఉన్నప్పటికీ ఒకే కథను, ఒక్కోసారి ఒక్కో points of view లో మళ్ళీ మళ్ళీ చెప్పి ఒకే కథకు వేర్వేరు అర్థాలను గోచరింపచేయడం ఈ రెండో తరహా సినిమాల ప్రత్యేకత. Run Lola Run, Roshoman, Sliding Doors లాంటి సినిమాలు ఈ రకం సినిమాలకు ఉదాహరణలు.
ఉదాహరణకు Run Lola Run సినిమాలో “లోలా” అనే అమ్మాయికి తన ప్రేమికుడైన “మన్ని” నుంచి ఫోన్ కాల్ రావడంతో కథ మొదలవుతుంది. 20 నిమిషాల్లో 100000 మార్కులు(జర్మనీ కరెన్సీ) తీసుకురాకపోతే తన ప్రాణానికే ముప్పని ఆమెతో చెప్తాడు మన్ని. తన ప్రేమికుడి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో లోలా ఏం చేసింది అనే దానికన్నా , “ఇలా జరిగితే ఏమయ్యుండేది”, “పోనీ ఇలా జరిగితే ఎమి జరిగుండేది”,అనే what-if కండిషన్ల ద్వారా ఒకే కథను మూడు సార్లు వేర్వేరు విధంగా చిత్రీకరించారు దర్శకులు. ఇందులో ఏ ప్రయత్నం నిజంగా(సినిమాటికె స్పేస్ లో) జరిగింది, ఈ ప్రయత్నాలు ఊహాజనితమైనవి అని చెప్పలేము.ఇదే విధంగా అకిరా కురసవ గారి రోషమన్ సినిమాలో ఒకే కథను వేర్వేరు points of view ద్వారా చూపించగలిగారు. అలాగే తమిళ్ లో వచ్చిన “వీరుమాండి” సినిమాకూద ఈ కోవలోకి చెందినదే.
2)యాదృచ్చికంగానూ అకస్మాతుగానూ జరిగే సంఘటనలతో మేళవించిన దృశ్యాలు, ఈ సంఘటనల పర్యవసానంగా మార్పు కొందరి జీవితాల్లో జరిగిన మార్పులు, అనుభవాలను కథారూపంలో తెరకెక్కించడం ఒక రకం.Pulp Fiction, Amerros Perros, 21 Grams, Traffic ళంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి.
మొదట్లో స్పైను మరియు ఇతర లాటిన్ అమెరికా దేశాల్లో ఇలాంటి సినిమాలు తీయడం మొదలయిందని నా ఉద్దేశం. అందుకు ఇదీ కారణం అని చెప్పడం కష్టమైనప్పటీకీ, రాను రాను పెరిగిపోతున్న నేరప్రవత్తి, డ్రగ్స్ ఉపయోగం, నానాటికీ తరుగిపోతున్న మానవ విలువలు, క్రమంగా క్షీణంచిపోతున్న మానవ సంబంధాలు, ఆయా దేశాల్లోని జీవన పరిస్థితులు, క్షణం తీరికలేని జీవితాలను సినిమాలో పొందు పరచాలంటే అంతకముందున్న సినిమాటిక్ ఉపకరణలేవీ ఉపయోగపడకపోవడంతో, కొత్త రకమైన సినిమాలతో వారి జీవితాల్లోని చైతన్యాన్ని ప్రతిబింబించేలా చేయాలన్న నేపధ్యంలో ఈ non-liner narrative సినిమా పుట్టివుండవచ్చని నా అభిప్రాయం.
ఇంకా లోతుగా చూస్తే, సంబంధం లేని ఎన్నో అంశాలు మనల్ని ఒక్కొక్కరిగా విడతీస్తున్నా ఈ విశ్వంలోని ఒక తెలియని దారమేదో మనల్నందరినీ కట్టిఉంచుతుందనీ చెప్పడంకూడా ఈ సినిమాల ఉద్దేశం అయ్యిఉండవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రపంచంలోని ఎంతో మంది ఇప్పుడూ ఈ non linear cinema పై కన్నేశారు. ఈ మధ్యకాలంలో వచ్చిన డజన్ల కొద్దీ సినిమాలు ఈ నమ్మకాన్ని నిజం చేశాయి. హలీవుడ్లో వీచిన ఈ గాలులు క్రమంగా మన బాలీవుడ్ కి చేరాయి.దాని ఫలితమే Life in a Metro, Salaam-E-Ishq, Honeymoon Travels Pvt Ltd”. బాలీవుడ్ దాక చేరిన ఈ గాలి మనవైపుకీ త్వరలో వీస్తుంది.అలాంటప్పుడు గాలి ఎటువైపు వీస్తే అటూవైపు గుడ్డిగా పయనించకుండా అసలీ non linear cinema అవసరం ఎంటి? దానివెనుక వున్న సిధ్ధాంతమేంటి అని సూక్ష్మంగా ఆలోచించి మన సమాజానికి తగ్గట్టుగా ఈ రకమైన సినిమాలను తీయగలిగితే మన సినిమాకెంతో మేలు జరగవచ్చు.
ఒక విధంగా మన జీవితలను సినిమా రూపంలో ప్రతిబింబింపజేయాలంటే ఈ రకమైన సినిమాలే అనువైనవి. అందుకు అనేక కారణాలున్నాయి. మీ జీవితమే తీసుకోండి. అంటా మీరనుకున్నట్టే జరిగిందా?మీ స్నేహితులతో మీ పరిచయాలను గుర్తుకు చేసుకోండి.ఈ జీవితమంతా ఒక పెద్ద ఏక్సిడెంట్ లా నిపించదూ? నేనెవర్ని? నేను రాసిన ఈ వ్యాసాన్ని మీరెందుకు చదవాలి? అసలీ జీవితానికి అర్థముందా? ఎక్కడ దొరుకుతాయీ ప్రశ్నలకు సమాధానాలు? అయినా మూడూగంటల్లో చూసి మర్చిపోయే సినిమాల గురించి ఇంత విశ్లేషణ అవసరమా?
ఏమో? కాలం ఒడి ఒడి గా సాగిపోతున్న ఈ రోజుల్లో కాసేపాగి మనల్ని మనం పరిశీలించుకోలేము కాబట్టే మన జీవితల్నే సినిమాగా తీస్తే rewind చేసో fast forward చేసో, pause నొక్కో అర్థం చేసుకోవచ్చేమో?

ఆ సినిమా థీమ్‌ ఆధారంగా రాసుకున్న



   ప్రతి సినిమాకు ఏదో ఒక ఆధారం ఉంటుంది. మా సినిమా చూస్తూన్నప్పుడు చెన్నై ఎక్స్ ప్రెస్ , తేరెనాల్ లవ్ హోగయా, చిత్రాలు గుర్తుకురావచ్చు ఐతే ఈ సినిమాకు మూలాధారం మాత్రం 'డాని బోయెల్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఎ లైఫ్‌లెస్‌ ఆర్డినరీ' సినిమాలో ఓ థీమ్‌ ఆధారంగా ఈ కథ రాశాను. అందులో కధానాయకుడు తనకు నచ్చని పనిని మళ్లీ చేయాల్సి వస్తుంది. ఆ అంశం ఆధారంగానె ఈ సినిమా చేశాను.

 డిఫరెంట్‌ కల్చర్స్‌లో, కొత్త ఫ్లేవర్‌లో ఉండాలని తెలుగు, తమిళ, మలయాళ నేపథ్యంలో తెరకెక్కించాను. నేననుకున్నది అనుకున్నటుగా చెప్పగలిగాను' అని యువ దర్శకుడు మహేష్‌బాబు.పి తెలిపారు. సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'రారా కృష్ణయ్య'. వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు దర్శకుడి మాటల్లో...
మొగుడు, బావ సినిమాలకు దర్శకత్వ శాఖలో, సోలో సినిమాకు స్క్రిప్ట్‌ వర్క్‌లో భాగమయ్యాను. ఆ తరువాత ఈ కథ రాసుకున్నాను. నిర్మాత వంశీగారితో నాకు మంచి పరిచయం ఉంది. ఆయనకు నేను చేసిన ఓ షో రీల్‌ చూపించాను. తరువాత ఈ కథ చెప్పాను. హీరోగా ఎవరు కావాలని అడిగారు. కొత్తవారైతే చాలని చెప్పాను. అప్పుడాయన సందీప్‌కిషన్‌తో చేద్దాం అని చెప్పారు. తరువాత సందీప్‌కి కథ చెప్పడం అతను ఓకే అనడం వేగంగా సినిమా ప్రారంభించి పూర్తి చేయడం జరిగిపోయాయి.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బావుందని అంటున్నారు. కొందరు ఫస్టాఫ్‌ బావుందని, సెకెండాఫ్‌ స్లోగా ఉందని అంటున్నారు. ఆ మాట మినహా మిగిలిన అన్ని విషయాల్లోను హ్యాపీగా ఉన్నాను. ప్రేక్షకుల నుండి వస్తోన్న స్పందన చూస్తుంటే సినిమా అందరికీ రీచ్‌ అయ్యిందనే అనిపిస్తోంది.
100 సినిమాల్లో జగపతిబాబుగారు నా మొదటి చిత్రంలోనే నటించటం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు కథ చెప్పి ఒప్పించడంలోనే సక్సెస్‌ అయ్యాననిపించింది. ఇందులో జగపతి-సందీప్‌ల పాత్రలు నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. నేను మా అన్నయ్య కూడా దాదాపుగా ఇలాగే ఉంటాం.
నటీనటుల నుండి చక్కని పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకున్నానని చాలామంది చెప్పారు. ఇందులో జగపతిబాబు, సందీప్‌లతోపాటు రెజీనా క్యారెక్టర్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాటలు, ఫోటోగ్రఫి కూడా మరింత బలానిచ్చాయి. డిఓపితో నాకు మంచి రాపో ఉండడంతో కథను ఓన్‌ చేసుకుని ఆయన వర్క్‌ చేశారు. అందుకే సినిమా విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఉంది.
కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు చేస్తే దర్శకుడు మినహా అందరికీ పేరొస్తుంది. కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమా చేస్తేనే దర్శకుడికి మంచి గుర్తింపు వస్తోంది. నా తొలి ప్రయత్నం ఎంటర్‌టైన్‌మెంట్‌తో చేశాను కాబట్టి అంతగా పేరు రాకపోవచ్చు అంటూ ముగించారు.

Brief Encounter

బ్రీఫ్ ఎన్‌కౌంటర్ అనే ఈ అద్భుతమయిన సినిమా కాన్సెప్టు 1945 లో వచ్చిందంటే నమ్మడానికి చాలా ఆశ్చర్యమనిపిస్తుంది.
మామూలుగా పెళ్ళి అనేది ప్రేమ జీవితానికి ముగింపు. ఆ తరువాత ప్రేమ అంటే మన భాగస్వామితోనే. కానీ పెళ్ళి తరువాత మీ భాగస్వాములతో కాక వేరొకరితో ప్రేమలో పడితే ??
ఆ సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించే అద్భుతమయిన సినిమా “బ్రీఫ్ ఎన్‌కౌంటర్”.
లారా అనే ఒక మామూలు గృహిణి ఎంతో ఆనందమయిన జీవితం గడుపుతుంటుంది. మంచి భర్త, ఇద్దరు పిల్లలు.
ప్రతీ గురువారం “మిల్ఫర్డు”కి వెళ్ళి షాపింగు చేసి సినిమాలు చూడడం అలవాటు.
అలాంటి ఆమెకి ఒకరోజు అక్కడి రిఫ్రెష్‌మెంటు రూములో అలెక్ అనే ఒక డాక్టరు అనుకోకుండా పరిచయమవుతాడు. ఇద్దరూ ఒకరి పట్ల ఇంకొకరు ఆకర్షితులవుతారు.
ప్రతీ గురువారం అక్కడ కలిసి తిరుగుతుంటారు. కానీ లారా అలెక్ ని కలిసిన ప్రతీ సారీ సంఘర్షణకి లోనవుతుంటుంది. తను తప్పు చేస్తుందా‌ ? తన భర్తకీ, పిల్లలకీ ద్రోహం చేస్తుందా అని అనుక్షణం ఆలోచిస్తుంటుంది. అలాగని అలెక్‌ని వదులుకోవడానికీ ఇష్టపడదు. మరి చివరికి ఏం జరిగిందనేదే కథ….
మొరాలిటీ ప్రకారం ఆలోచిస్తే మన భాగస్వామికి కట్టుబడి ఉండాలి. వారినే ప్రేమించాలి. కానీ ఆకర్షణ, ప్రేమ అనేవి సమయం, సందర్భం అనుసరించి వచ్చేవా అంటే సమాధానం చెప్పడం‌కష్టమే. అలాంటి విషయాన్ని ఏ జడ్జ్‌మెంటూ లేకుండా ఈ సినిమాలో చూపడం నాకు నచ్చింది.
అలాగే సినిమాలో ఆ పెళ్ళి తరువాత ప్రేమలో పడటానికి ఇంకేవో కారణాలు కూడా చూపించడు దర్శకుడు. అంటే వైవాహిక జీవితం బాగోలేకనో, భర్తతో గొడవపడో, భర్త మంచివాడో లాంటి కారణాలు ఏవీ చూపించడు. ఇద్దరు చక్కని పిల్లలు, మంచి భర్త ఉన్న గృహిణి ఇంకొకరితో ప్రేమలో పడుతుంది అంతే.
ఈ సినిమాలో ప్రతీ సన్నివేశంలోనూ దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. చిక్కని స్క్రిప్టు ఉన్న కథ. తీయడంలోనూ ఒక భిన్నమైన శైలి. మానసిక సంఘర్షణ చూపించాల్సిన ప్రతీ సీనునూ అద్భుతంగా పండించాడు దర్శకుడు.
అదీ కాక కథ నేరేటీవ్ గా సాగుతుంది. లారా తన అనుభవం చెబుతున్నట్టుగా నడుస్తుంది సినిమా. కాబట్టి దర్శకుడు ఇంకా సమర్థవంతంగా చెప్పగలిగాడని నాకు అనిపిస్తుంది.
ఇందులో నటీనటుల నటన సినిమాని ఇంకో స్థాయికి తీసుకు వెళుతుంది. చక్కని ప్రదర్శనలు ఇచ్చారు.
కొన్ని సన్నివేశాలు అద్భుతంగా కుదిరాయి. (warning: maybe spoilers)
  • సినిమా మొదట్లో స్నేహితురాలు డాలీ గురించి లారా ఆలోచనలు సాగడం
  • అలెక్ వద్దకి వెళ్ళాలా వద్దా అని అప్పటిదాకా సంశయించిన లారా, అతని దగ్గరకి వెళ్ళిన తరువాత ఎలాంటి అపరాధ భావం లేకుండా ఆనందంగా గడపడం
  • గదిలో తన భర్త ఎదురుగానే ఉన్నా ఎక్కడో దూరంగా ఉన్నట్లు ఫీలవడం
  • అపరాధ భావన, సంతోషానికి మధ్య కొట్టుమిట్టాడే సన్నివేశాలు
  • సినిమా చివరలో లారా ఆత్మహత్య చేసుకోవాలనుకునే సన్నివేశం
  • సినిమా ఆఖరులో లారా భర్త “Come back to me” అనే సన్నివేశం
కానీ కొన్ని సన్నివేశాలు అర్థాంతరంగా ముగిసాయని కూడా అనిపించాయి. ఉదా: అలెక్ స్నేహితుడి అపార్టుమెంటులో లారా, అలెక్ సన్నిహితమవుతున్న సమయంలో అతని స్నేహితుడు వచ్చే సన్నివేశం. రొమాన్సు పాళ్ళని తగ్గించడానికి సన్నివేశం టోన్ డౌన్ చెయ్యబడిందేమో అని అనిపించింది.
డయిలాగులు కూడా బాగా కుదిరాయి. ఒకచోట అలెక్‌తో తన అనుబంధం గురించి ఆలోచిస్తూ నేను గిల్టీగా ఫీలవాలి కానీ నేను అలా ఫీలవట్లేదు అని అర్థం వచ్చే డయిలాగు సన్నివేశం పరంగా అద్భుతంగా ఉంటుంది.
సినిమాలో డయిలాగుల కన్నా మోనోలాగులే ఎక్కువ ? (లారా ఆలోచనలోనే సినిమా అంతా సాగుతుంది కాబట్టి). అది కూడా సినిమాలో ఒక రకమయిన ఎక్స్‌పరిమెంటే. కానీ చాలా చక్కగా కుదిరింది. ఎందుకంటే లారా పాయింట్ ఆఫ్ వ్యూని దర్శకుడు చూపించగలిగాడు. ఆలోచనలు, అపరాధ భావనలు, సంతోష సమయాలు అన్నీ.
ఈ సినిమా కాన్సెప్టుని మూలంగా తీసుకుని ఇంకా ఎన్నో సినిమాలు వచ్చాయి అని నాకు అనిపించింది. ఆంగ్లంలో “Unfaithful”, హిందీలో “Murder” మొదలయినవి. కానీ ఈ సినిమా టచ్ చేసినట్టు మిగతావేవీ మనల్ని టచ్ చెయ్యవు. దానికి ఒక కారణం మిగతావి శృంగార ఆధారితం, ఈ సినిమా రొమాన్స్ ఆధారితం కావడం కావచ్చు.
డేవిడ్ లీన్ సృష్టి అయిన ఈ సినిమాని మాత్రం చూడాల్సిందే !
–ప్రవీణ్ గార్లపాటి

 ‘ఆర్య’ కథకు ప్రేరణ ఎంటి? ఎవరికోసం ఆ కథ తయారు చేశారు?
 సుకుమార్: ప్రేరణ అంటూ ఏమీ లేదు. కొత్తగా ఆలోచించానంతే. ప్రేమించడం, ప్రేమను వ్యక్తపరచడం, దాని గొప్పతనాన్ని తెలియజేయడం... ఇన్నాళ్లూ రెండున్నర గంటల పాటు సినిమాల్లో ఇదే చూపించారు. ‘ఆర్య’ కథ ఆ విధానానికి పూర్తి విరుద్ధమైంది. మననుంచి ఏదో ఆశించి సూర్యుడు వెలుగునివ్వడు. మన నుంచి ప్రతిఫలం ఆశించి ప్రకృతి మనల్ని అక్కున చేర్చుకోదు. ‘ఆర్య’లో హీరో కూడా అంతే... తనను ఆ అమ్మాయి ప్రేమిస్తుందా, లేదా అనేది అతనికి అనవసరం. తాను మాత్రం ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని ప్రారంభంలోనే చెప్పేస్తాడు. ఆ తర్వాత జరిగే కథే ‘ఆర్య’. వన్‌సైడ్ లవర్స్ తరఫున వకాల్తా పుచ్చుకుని ట్రెండ్‌కి ఎదురెళ్లి మరీ నేను ‘ఆర్య’ తీశాను. అదే జనానికి కూడా నచ్చేసింది. నిజానికి ఈ కథను నేను తయారు చేసుకుంది అల్లు అర్జున్ కోసం కాదు. అల్లరి నరేష్ కోసం. దీనిని ఒక చిన్న సినిమాగా తీద్దాం అనుకున్నా. కానీ దేవుడు వేరేలా తలచాడు.

మంచిదొంగ కథ అలా కుదిరింది

Published at: 10-07-2014 00:17 AM
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రం మంచిదొంగ(1988). ఈ చిత్రంలో విజయశాంతి, సుహాసిని కథానాయికలు. ఈ చిత్రకథ పుట్టుక వెనుక చిన్నకథ ఉంది. అదేమిటంటే..చిరంజీవి హీరోగా తన సొంత బేనరుపై ఓ సినిమ తీయడం కోసం రాఘవేంద్రరావు ఒక కథ తయారు చేయించారు. రచయిత ఎం.వి.ఎస్‌.హరనాథరావు కథకుడు. అయితే కొన్ని కారణాల వల్ల రాఘవేంద్రరావు తన ప్రపోజల్‌ని వాయిదా వేసుకొని, ఆ కథ తీసుకోమ్‌ని నిర్మాత కె.దేవీవరప్రసాద్‌కు చెప్పారు. హరనాథరావు ఆ కథ చెప్పడానికి దేవీవరప్రసాదరావు దగ్గరకు వెళ్లారు. ఇంటర్వెల్‌ వరకే కథ ఉండటంతో సెకండాఫ్‌ కోసం చర్చలు ప్రారంభించారు. ఆ సమ్‌యంలో పరిశ్రమ్‌లోనే స్లంప్‌ వచ్చింది. చిరంజీవి డేట్స్‌ ఇచ్చారు కానీ కథ సిద్ధం కాలేదు. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి దేవీవరప్రసాద్‌ది. అప్పుడు అల్లు అరవింద్‌ జోక్యం చేసుకొని ‘మీ కథ రెడీ కాలేదు. చిరంజీవిగారి డేట్స్‌ దగ్గర పడుతున్నాయి. అయినా ఆయన సినిమకి స్లంప్‌ ఏమిటండీ... కనీసం పాటలన్నా మొదలుపెట్టండి’ అని ఒత్తిడి చేశారు. ఇంకా కొంత సమ్‌యం కావాలని దేవీవరప్రసాద్‌ అడిగినా ఆయన వినిపించుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో చిరంజీవిని కలసి తనకు మ్‌రికొంత టైమ్‌ కావాలని దేవీవరప్రసాద్‌ అడగటంతో ఆయన సరేనన్నారు. అటువంటి సమ్‌యంలోనే రచయిత విజయేంద్రప్రసాద్‌ ఒక కథ చెప్పారు. హరనాథరావు చెప్పిన కథకు ఈ కథను జోడిస్తే మ్‌ంచి సబ్జెక్ట్‌ అవుతుందనిపించింది దేవీవరప్రసాద్‌కి. అదే విషయం రాఘవేంద్రరావుకి చెప్పారాయన. ఆయన ఆ కథ విని రాత్రి 11 గంటలకు ఫోన్‌ చేశారు. సాధారణంగా ఆ సమ్‌యంలో ఆయన ఎవరికీ  ఫోన్‌ చెయ్యరు.. తియ్యరు. రెండు కథలు మిక్స్‌ చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఆయనకూ నచ్చడంతో ఆ సమ్‌యంలో ఫోన్‌ చేశారు. అలా ఇద్దరు రచయితలు తయారు చేసిన కథతో రూపుదిద్దుకొన్న చిత్రం ‘మ్‌ంచిదొంగ’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమలోనే తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌గా విజయశాంతి నటించారు. అలాగే ‘నా రూటే వేరు’ అనే మోహన్‌బాబు పాపులర్‌ మేనరిజం ఈ సినిమలోదే.